For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SSMB28: మహేశ్ ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్.. సినిమా వచ్చేది ఎప్పుడో తెలిస్తే!

  |

  సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చిన్న వయసులోనే తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుని ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మహేశ్ బాబు. హీరోగా మారిన తర్వాత విభిన్నమైన చిత్రాలు, అదిరిపోయే యాక్టింగ్, హ్యాండ్సమ్‌ లుక్స్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో అతడి ఫాలోయింగ్, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఇక, అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను మరింత వేగంగా లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

  ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేయనున్నాడు. వాస్తవానికి 'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో భారీ ప్రాజెక్టును ప్రకటించాడు. అయితే, ఇది ప్రారంభం అవడానికి చాలా సమయం ఉండడంతో దీని కంటే ముందు మరో సినిమాను చేయాలని ఈ స్టార్ హీరో డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను ప్రకటించాడు.

  'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే జరిగాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. అయితే, ఈ మూవీ షూట్ జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

  పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!

  Mahesh Babu and Trivikram Movie Postponed to Summer

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలు పెట్టని కారణంగా.. విడుదలను కూడా వాయిదా వేసేస్తున్నారట. గతంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని అన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం దీన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా షూట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇదే నిజం అయితే సూపర్ స్టార్ అభిమానుకుల మరో షాక్ తగిలినట్లు అవుతుంది.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతం అందించబోతున్నాడు.

  English summary
  Super Star Mahesh Babu recently Startes his 28 film with Trivikram Srinivas. This Movie Will be Release on Next Summer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X