Just In
Don't Miss!
- News
Republic day:72వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న భారత్
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అత్యుత్సాహం.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తొక్కిసలాట
సూపర్ స్టార్ మహేష్ బాబు అసలే వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సినిమాలతో దూకుడుమీదున్న మహేష్ బాబు.. మరోసారి బాక్సాఫీస్ పని పట్టేందుకు వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్2తో వచ్చి భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మహేష్ బాబుతో చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశన్నంటాయి.

పోస్టర్స్, పాటలతో హల్ చల్..
ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఒక్కో వారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ హల్ చేసిన చిత్రబృందం రీసెంట్‌గా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. సరిలేరు నీకెవ్వరు అంటూ విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మధ్య విడుదల చేసిన సరిలేరు టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కాగా.. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెంచేసింది చిత్రయూనిట్. సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దమైన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది టాలీవుడ్‌లో జరగబోయే ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్‌గా ఇది నిలుస్తుందని సరిలేరు టీమ్ భావిస్తోంది.

ముఖ్య అతిథిగా చిరు..
సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకురానున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలైన దిల్ రాజు, అనిల్ సుంకర, అనిల్ రావిపూడి మెగాస్టార్‌ను ఆహ్వానించేందుకు వెళ్లిన సందర్భంలో దిగిన ఫోటోలు సోషల్ మీడయిాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్‌కు రావడానికి చిరంజీవి ఒప్పుకోవడంతో మహేష్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ అత్యుత్సాహం..
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. మహేష్ బాబుతో ఫ్యాన్స్ కోసం ఓ ఫోటో షూట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.