రాజమౌళిపై మహేష్ బాబు ఫైర్..ఆ స్టోరీ లీక్ చేస్తానంటున్న ప్రియాంక..
సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా 'SSMB 29' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పరిగణించబడుతోంది. ఇటీవల నవంబర్‌లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని రాజమౌళి ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, రాజమౌళికి మధ్య ట్వీట్ వార్ జరిగింది. వారి మధ్యలోకి హీరోయిన్ ప్రియాంక, నటుడు పృథ్వీరాజ్ రావడంతో మరింత ఆ వార్ మరింత ఇంట్రెస్టింగ్ మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి "నవంబర్‌లో ఒక పెద్ద అప్డేట్ వస్తుంది" అని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #SSMB29Update వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నవంబర్ నెల ప్రారంభం కావడంతో అభిమానులు అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. డైరెక్టర్ రాజమౌళిని మహేష్ బాబు ప్రశ్నించారు. "సార్, నవంబర్ వచ్చేసింది.. అప్డేట్ ఎక్కడ?" అంటూ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ప్రశ్నకు రాజమౌళి వెంటనే స్పందించారు. "అవును మహేష్.. నవంబర్ వచ్చింది. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూలు ఇవ్వాలని అనుకుంటున్నావు?" అంటూ సైటర్ వేశారు. దానికి మహేష్ తగ్గేదేలే అన్నట్టుగా "మీరు ఎప్పటి నుంచో తీస్తున్న మహాభారతం సినిమాకి రివ్యూ ఇస్తాను సార్" అంటూ
రివర్స్ పంచ్ వేశారు. దీంతో రాజమౌళి సైలెంట్ అయ్యారు. కానీ, మహేష్ బాబు మరో ట్వీట్ చేస్తూ.. "నవంబర్‌లో ఏదో హామీ ఇచ్చారు కదా సార్, ఆ మాటను నిలబెట్టుకోండి" అని జక్కన్నకు హామీని గుర్తు చేశారు.
అప్పడూ రాజమౌళి "మహేష్, ఇప్పుడే నవంబర్ మొదలైంది. మెల్లమెల్లిగా ఒక్కొక్కటిగా అప్డేట్ ఇద్దాం" అని చెప్పారు. దీంతో మహేష్ కాస్త డోస్ పెంచుతూ.. "ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్? 2030లో స్టార్ట్ చేద్దామా?" అంటూ షాకింగ్ ట్విట్ పెట్టారు. అప్పటికే ఈ ట్వీట్ వార్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సారి మహేష్ చర్చలోకి ప్రియాంక చోప్రాను లాగారు. "మీ సమాచారం కోసం, మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్‌లో తిరుగుతూ.. ప్రతి వీధిలో ఇన్‌స్టా స్టోరీలు పెడుతోంది" అంటూ మరో ట్వీట్ చేశారు.
దీంతో ఆ వార్ లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చారు. "హలో హీరో... సెట్‌లో నువ్వు నాతో పంచుకున్న కథలన్నీ నేనే లీక్ చేయాలా? ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఏసేస్తా!" అంటూ మహేష్ బాబు స్టైల్‌లోనే రిప్లై ఇచ్చింది. ఈ సరదా మాటలతో సోషల్ మీడియాలో నవ్వులు పూశాయి. అదే సమయంలో రాజమౌళి కూడా ఈ సరదా చర్చలో జాయిన్ అయి,"ప్రియాంక నటిస్తుందనే విషయాన్ని నువ్వు ఎందుకు బయటపెట్టావ్ మహేష్? సర్ప్రైజ్‌ని నాశనం చేసావ్" అంటూ మరో పోస్ట్ చేశారు.
ఇక మహేష్ కూడా సైలెంట్ గా ఉండక, "సర్ప్రైజా? మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సర్ప్రైజ్ అనుకోవాలా?" అంటూ మరో లీక్ ఇచ్చేశారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ చర్చలోకి ఎంట్రీ ఇచ్చారు. "రాజమౌళి సార్, నేను ఇలాగే హైదరాబాద్ వస్తే.. నా ఫ్యామిలీ నన్ను అనుమానించడం మొదలుపెడుతుంది" అని ట్వీట్ చేశారు. దీంతో రాజమౌళి కాస్త సిరీయస్ గా "మహేష్, ఇప్పుడు నువ్వు అన్నీ నాశనం చేశావు" అన్నారు.
దీంతో మహేష్ బాబు కాస్త కూల్ గా స్పందిస్తూ, "సరే సార్, ఒక సంధి చేసుకుందాం. ఇప్పటికే అందరికీ తెలిసిన ఏదో విషయాన్ని రేపు ప్రకటించండి. దానిని మీరు ఇప్పటికీ సర్ప్రైజ్ అని అనుకుంటే!" తన స్టైల్ లో అడిగాడు. అప్పుడు రాజమౌళి కూడా "డీల్ ఓకే! కానీ, వ్యంగ్యంగా మాట్లాడినందుకు నీకు జరిమానా వేయాలని ఫిక్స్ అయ్యాను. ఇక నీ ఫస్ట్ లుక్ రిలీజ్ ని ఆలస్యం చేస్తాను పో" అంటూ మరో పంచ్ వేశారు.
ఇదే అదునుగా భావించిన సుకుమార్ 'నాకు తెలుసు సార్.. మీరు విలన్స్‌ను లవ్ చేస్తారు. నా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయండి' అంటూ ఈ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నోరుజారారు. మరోసారి ప్రియాంక ఎంట్రీ ఇచ్చి.. 'బెటర్ లక్ నెక్స్ టైం.. మహేష్ బాబు కాలుతుందా?'అంటూ సైటర్ వేసింది. దీనికి మహేష్ బాబు..'ఓరి దీని వేశాలో' అంటూ రిప్లే ఇచ్చారు. ఫైనల్ గా ట్విట్ వార్ ముగిసింది.
ఇప్పటివరకూ 'SSMB 29'గురించి అధికారికంగా మేకర్స్ ఏ అప్డేట్ ఇవ్వకపోయినా.. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు నటిస్తున్నారని బలమైన సమాచారం వెలువడుతోంది. ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఒడిశా షెడ్యూల్‌లో కనిపించిన ఫోటోలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.మహేష్ బాబు - రాజమౌళి సరదా ట్వీట్ల సిరీస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
మరోవైపు రాజమౌళి ఎప్పుడూ తన సినిమాల ప్రమోషన్‌తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గతంలో 'RRR' కి ముందే ఆయన చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అదే పద్దతిని 'SSMB 29' కోసం ఉపయోగిస్తున్నారు. ఎలాంటి పోస్టర్ లేకుండా, ఒక్క అప్డేట్ లేకుండానే, కేవలం ట్వీట్లతో సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమనేది రాజమౌళి మార్కెటింగ్ మాస్టర్‌మైండ్ అనే చెప్పాలి. "జక్కన్న అప్డేట్ ఇవ్వకపోయినా ట్వీట్లు మాత్రం బ్లాక్‌బస్టర్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందని మహేష్ బాబు, రాజమౌళి ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











