Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Hero Teaser: హీరోగా మహేష్ మేనల్లుడు.. టక్కరి దొంగ స్టైల్‌లో ఎంట్రీ ఇస్తున్న అశోక్ గల్లా
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి పవర్ఫుల్ గా సిద్దమవుతున్న వారిలో అశోక్ గల్లా ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకైన అశోక్ గల్లా ఎంట్రీ పై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక నేడు అతను మొదటి సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను మహేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో
అశోక్ గల్లా మొదటి సినిమాను అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తుండగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఇంతకుముందు నాగార్జున నానిలతో దేవదాస్ అనే మల్టీస్టారర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక అశోక్ గల్లా కోసం ఈసారి మరొక డిఫరెంట్ కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ రిలీజ్ చేసిన టీజర్
సినిమాకు హీరో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక మొదటి టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన మహేష్ బాబు అశోక్ సినిమా టీజర్ ను లాంచ్ చేసినందుకు హ్యాపీగా ఉందని కామెంట్ చేశారు. అలాగే లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇక హీరో జర్నీ కూడా మొదలు కానున్నట్లు వివరణ ఇచ్చారు.

మహేష్ టక్కరి దొంగ స్టైల్ లో
మహేష్ బాబు ట్విట్టర్ నుంచి టీజర్ విడుదల కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాలో అశోక్ కౌ బాయ్ పాత్రలో మహేశ్ టక్కరి దొంగ లుక్ ను గుర్తు చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Recommended Video

త్వరలోనే రిలీజ్..
చూస్తుంటే ఘట్టమనేని మహేష్ మేనల్లుడు సాలీడ్ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఒక కౌ బాయ్ బ్యాక్ డ్రాప్ ను సెలెక్ట్ చేసుకోవడం కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే గత ఏడాదిలోనే ఈ సినిమా పూర్తవ్వాల్సింది. కానీ కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారు.