ఎక్కడా తగ్గని స్టార్ డాటర్స్ సితార-ఆద్య.. ఏకంగా గ్లోబల్ బ్రాండ్ తో యూట్యూబ్ సిరీస్!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు, స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఇద్దరూ కలిసి 'ఏ అండ్ ఎస్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. పిల్లలు కాదు పిడుగులు అన్నట్టు సిని ప్రముఖుల ఇంటర్వ్యూలు సైతం చేసి ఫాలోవర్స్ పెంచుకున్నారు. లాక్ డౌన్ లో ఈ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ఇళ్లకు పరిమితమైన చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మ విశ్వాసం పెంపొందించే విధంగా సెసామీ అనే సంస్థ తెలుగులో ప్రత్యేక వీడియోలు రూపొందిస్తున్నట్టు సమాచారం. తాజాగా సెసేమ్ వర్క్ షాప్ - తెలుగు యూట్యూబ్ ఛానల్ తన మొదటి ఒరిజినల్ సిరీస్ టాకింగ్ అబౌట్ టాకింగ్స్ తో ముందుకు వచ్చింది. ఒక లాభాపేక్ష లేని పిల్లల వర్క్ షాప్ కి సంబంధించిన అమెరికన్ ఛానల్ కి తెలుగు విభాగమిది.

ఈ కిడ్స్ ఛానల్ లో సితార-ఆద్య ఎపిసోడ్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. తొలిగా సితార-ఆద్య జోడీ బంగాళదుంప పై ఫన్ క్రియేట్ చేస్తూ టీచర్లుగా మారిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ లో టాకింగ్ ఎబౌట్ టాకింగ్ విత్ ఎల్మో ఆసక్తి కలిగించింది. ఇక సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 388కే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె యూట్యూబ్ ఛానెల్ కోసం సిల్వర్ బటన్‌ను కూడా అందుకుంది. సితారకు వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్ ఉంది మరియు ఆద్యతో మరో ఛానెల్ కూడా నడుస్తోంది. ఇక చిన్నవయసులోనే వీరు ఇద్దరూ కలిసి గ్లోబల్ బ్రాండ్ కోసం పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











