టీనేజ్‌లోకి ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని.. తల్లి నమత్ర ఎమోషనల్ ట్వీట్

సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని టీనేజ్‌లోకి ప్రవేశించాడు. ఆగస్టు 31న గౌతమ్ తన 13వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నాడు. తన కుమారుడి జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఇన్స్‌టాగ్రామ్‌లో తల్లి నమ్రత శిరోద్కర్ ఎమోషనల్‌‌గా ఓ పోస్టు పెట్టారు. గడియారం 12 గంటలు కొట్టగానే నా కుమారుడు 13 ఏట ప్రవేశించాడు. ఇప్పుడు గౌతమ్ టీనేజర్. తనకు ఇష్టమైన చాక్లెట్ ఇచ్చి మహేష్‌బాబు తన కుమారుడిని ముద్దుపెట్టుకొన్నాడు. గౌతమ్ ఘట్టమనేని ఐ లవ్ యూ.. నీ బర్త్‌డే అద్భుతంగా జరుపుకోవాలి అని నమ్రత పోస్ట్‌లో పేర్కొన్నారు.

గౌతమ్ విషయానికి వస్తే, 2006 ఆగస్టు 31 తేదీన మహేష్, నమ్రత దంపతులకు జన్మించాడు. మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో గౌతమ్ నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే.

Mahesh Babus son Gautam Ghattamaneni as teenager

ఇక మహేష్ కెరీర్ విషయానికి వస్తే.. మహర్షి సూపర్ హిట్ తర్వాత సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X