Mahesh Babu సర్కారు వారి పాట రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే కరోనా వైరస్ వలన మహేష్ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ మొదలు కాకపోయి ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట సందడి మొదలయ్యి ఉండేది. ఇక కృష్ణ పుట్టినరోజు కూడా కొన్ని కారణాల వల్ల ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాటపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా దర్శకుడు అన్ని వర్గాలకు నచ్చే విధంగానే తెరకెక్కిస్తాడాని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అభిమానుల్లో వాటి వల్ల కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పాటయ్యింది. ముఖ్యంగా సినిమాలో ఒక సీనియర్ హీరో విలన్ గా కనిపిస్తాడని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ ఆ రూమర్స్ పై డైరెక్ట్ గా స్పందించకుండా సర్కారు వారి పాట టీమ్ అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. షూటింగ్ మళ్ళీ మొదలైన తరువాతే సర్కారు వారి పాటకు సంబంధించిన అప్డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు వివరణ ఇస్తూ.. అప్పటివరకు క్షేమంగా ఉంటూ కోవిడ్ ప్రోటోకాల్ ను ఫాలో అవుతుండాలని వివరణ ఇచ్చారు. దీంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. ఇక ముందుగా మేకింగ్ వీడియోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











