For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu SSMB28 నుంచి క్రేజీ అప్డేట్.. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా!

  |

  సుమారు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హవాను చాటుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు కెరీర్ స్టార్టింగ్ లోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక మహేశ్ బాబు అందానికి అమ్మాయిలు అందరూ మెస్మరైజ్ అయ్యారు. మహేశ్ అనే పేరులో మత్తు ఉంది అంటూ హార్డ్ కోర్ అభిమానులుగా మారిపోయారు. తల్లిదండ్రుల మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేశ్ బాబు షూటింగ్ పనుల్లో బిజీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు, మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న మరో మూవీ SSMB28కి సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చింది సినిమా యూనిట్.

   ఆశించిన స్థాయిలో లేని కలెక్షన్స్..

  ఆశించిన స్థాయిలో లేని కలెక్షన్స్..

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవాను చూపించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి. అయితే, ఈ ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మహేశ్ బాబు దూసుకుపోతున్నాడు.

  హీరోయిన్ గా బుట్టబొమ్మ..

  హీరోయిన్ గా బుట్టబొమ్మ..

  హిట్లు ఫ్లాపులను చూడకుండా సినిమాలు చేస్తోన్న మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలున్నాయి.

   మూడోసారి రిపీట్ గా కాంబో..

  మూడోసారి రిపీట్ గా కాంబో..

  టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేశ్ బాబు SSMB28 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే మార్కెట్లో కూడా ఈ సినిమాకు రోజురోజుకు డిమాండ్ గట్టిగానే పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

   సరికొత్త లుక్ లో మహేశ్ బాబు..

  సరికొత్త లుక్ లో మహేశ్ బాబు..

  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్నడు చేయని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. అలాగే సరికొత్త లుక్ లో మహేశ్ బాబు కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు, మహేశ్ బాబుపై సన్నివేశాలు చిత్రీకరించేది ఎప్పుడూ అని వివిధ ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ వాటికి సమాధానాలు ఇచ్చింది.

   జనవరి నుంచి నాన్ స్టాప్ గా..

  జనవరి నుంచి నాన్ స్టాప్ గా..

  SSMB28 సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ లో "షూటింగ్ కు అంతా సిద్ధమైంది. అమితమైన శక్తి, హుషారుతో జనవరి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేయనున్నాం. మరింత ఆశ్చర్యకరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి. త్వరలోనే వాటి వివరాలు చెబుతాం" అని ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ.

  క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో..

  SSMB28 మూవీ అప్డేట్ ట్వీట్ తో పాటు పలు ఫొటోలను షేర్ చేసింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ. ఈ ఫొటోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు. ఈ ఫొటోలు చూస్తుంటే వారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Director Trivikram And Super Star Mahesh Babu Combination Third Movie SSMB28 Regular Shoot Start From January. Producers Tweet Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X