Happy Birthday Chiranjeevi: చిరంజీవి ఫ్యాన్స్‌కు మహేశ్ సర్‌ప్రైజ్.. భోళా శంకర్ వచ్చేశాడు
తెలుగు తెరపై దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూ టాప్ హీరోగా దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులందరికీ మజాను పంచుతూనే ఉన్నారు. ఇక, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ మూవీలను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో తలా అజిత్ కుమార్ హీరోగా సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం' సినిమాను రీమేక్ చేస్తున్నారు. దీన్ని ఫ్లాప్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ రూపొందించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఈ డైరెక్టర్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. 'లూసీఫర్' రీమేక్ పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను విడుదల చేశారు.

ఈరోజు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని మెహర్ రమేశ్‌తో ఆయన చేయబోతున్న సినిమా నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా దీన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ఇక, ఈ సినిమాకు 'భోళా శంకర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన వీడియోలో దీన్ని రివీల్ చేశారు. ఇక, బ్యాగ్రౌండ్‌లో కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్ కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా మొత్తం అక్కడి నేపథ్యంతోనే సాగుతుందని పరోక్షంగా రివీల్ చేశారు. ఇక, ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ట్విట్టర్ ద్వారా 'భోళా శంకర్' వీడియోను మహేశ్ బాబు విడుదల చేశాడు. ఈ మేరకు తన ఖాతాలో 'పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఆవిష్కరిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. భోళా శంకర్.. ఎంతో దర్శకత్వ నైపుణ్యం ఉన్న నా స్నేహితుడు మెహర్ రమేష్, నాకెంతో ఇష్టమైన నిర్మాత అనిల్ సుంకర గారి కాంబోలో ఇది రాబోతుంది. మీకు ఈ ఏడాది అంతా విజయం, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో మెగా అభిమానులు మహేశ్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.
సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన ఆ మధ్య లుక్ టెస్ట్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది. అలాగే, ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











