Mahesh Babu ఒడిలో నిద్రపోతున్న పాప.. నిజంగా ఇది సూపర్ స్టార్ కంటే పెద్ద పోస్ట్!

రాజ్యానికి రాజైనా, కూలి పని చేసుకునే ఒక సాదారణ మనిషైనా కూడా వారి పిల్లలకు రియల్ హీరోనే. పసితనంలో పిల్లలు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. వారిది కల్మషం లేని ప్రేమ ప్రపంచం. అప్పుడప్పుడు మహేష్ అండ్ కిడ్స్ ను చూస్తే కూడా అలాంటి భావన కలుగుతుంటుంది. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ హీరోలలో మహేష్ టాప్ లిస్ట్ లో ఉంటాడని చెప్పవచ్చు. సూపర్ స్టార్ గా ఎంత క్రేజ్ అందుకున్నా కూడా మహేష్ తన ఇంట్లో మాత్రం ఒక సాధారణ వ్యక్తిలానే ఉంటాడు. కిడ్స్ కూడా మహేష్ ను ఎంతగానో ఇష్టపడతారు.

అభిమానులకు నచ్చే విధంగా

అభిమానులకు నచ్చే విధంగా

ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ స్థాయిని మహేష్ బాబు మరింత పెంచాడు. సినిమా సినిమాకు మార్కెట్ ను మరింత పెంచుకుంటూ వెళుతున్నాడు. వీలైనంత వరకు కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా అభిమానులకు నచ్చే విదంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

బయట హీరోలతో కూడా

బయట హీరోలతో కూడా

కేవలం సినిమాలు మాత్రమే కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్స్ లలో కూడా నటిస్తూ తన ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నాడు. మహేష్ సొంతంగా GMB ప్రొడక్షన్ ను కూడా స్థాపించాడు. కేవలం తన సినిమాలనే కాకుండా ఆ సంస్థలో బయట హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు.

ఆ విషయంలో మహేష్ దేవుడు

ఆ విషయంలో మహేష్ దేవుడు

ఇక మహేష్ బాబు గత కొన్నేళ్లుగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ ఊపిరి పోస్తున్నాడు. భార్య నమ్రత ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా పస ప్రాణాలను కాపాడారు. ఆ విషయంలో మహేష్ బాబు నిజంగా దేవుడు అంటూ నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటారు. అలాగే దత్తత తీసుకున్న గ్రామాలను కూడా అభివృద్ధి చేయిస్తున్నారు. రీసెంట్ గా అక్కడి ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్స్ కూడా వేయించారు.

Recommended Video

Mahesh Babu Namrata Shirodkar - Best Couple In Tollywood
సితార పాపతో అలా..

సితార పాపతో అలా..

ఇక చాలా రోజుల తరువాత మహేష్ బాబుకు సంబంధించిన ఒక క్యూట్ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. తన కూతురు సితారాను ఉదయాన్నే ఒడిలో పడుకోబెట్టుకోగా నమ్రత ఆ మూమెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక వారి ఆప్యాయతను అర్థం చేసుకున్న అభిమానులు నిజంగా మహేష్ కు తండ్రి పోస్టు.. సూపర్ స్టార్ పోస్ట్ కంటే పెద్దదే అని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X