For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్ మహేశ్ బాబు దూకుడు: గ్యాప్ లేకుండానే మరొకటి చేసేందుకు రెడీ

  |

  హిట్టు మీద హిట్లు.. హిట్టు మీద హిట్లు కొడుతూ ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలకు పెట్టింది పేరైన పరశురాం దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది భారీతనంతో రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తైంది.

  నడిరోడ్డుపై జబర్ధస్త్ వర్ష హల్‌చల్: ప్రేమించమంటూ వెంట పడుతూ.. మరీ ఇంత ఘోరంగానా!

  గత ఏడాది లాక్‌డౌన్ సమంయంలోనే మహేశ్ బాబు తన తదుపరి చిత్రంగా 'సర్కారు వారి పాట'ను చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో రెండో దానిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇటీవలే మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. ఇది కూడా నాలుగు రోజుల క్రితమే ముగిసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన దాదాపు సగం షూటింగ్ పూర్తైనట్లు టాక్ వినిపిస్తోంది.

  సాధారణంగా షెడ్యూల్ షెడ్యూల్‌కు చిత్ర యూనిట్ గ్యాప్ తీసుకుంటుంది. కానీ, ఇప్పుడు 'సర్కారు వారి పాట' కోసం మహేశ్ బాబు దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే గోవాలో చిత్రీకరణ జరుపుకుని వచ్చిన అతడు.. ఆగస్టు 30 అంటే సోమవారం నుంచి మరో షెడ్యూల్‌ను మొదలెట్టబోతున్నాడు. దీన్ని హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరపబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. ఇదే స్పీడు కొనసాగితే వచ్చే నెలలోనే షూటింగ్ కంప్లీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  Mahesh Babus Sarkaru Vaari Paata Hyderabad Schedule From August 30th

  బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో మహేశ్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించారు. అలాగే, అతడు చెప్పిన డైలాగ్స్, చూపించిన గ్రేస్‌ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. వీటితో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్‌గా ఉంది. దీంతో ఈ టీజర్‌కు ఇప్పటికీ అదిరిపోయే స్పందన వస్తోంది. ఫలితంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' వీడియో టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.

  చిరంజీవి ఇంట్లో పీవీ సింధు సందడి: సినీ స్టార్స్ ముందే ఆమెకు అరుదైన కానుక

  'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు మాస్ రోల్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో అతడిని అదిరిపోయే రేంజ్‌లో చూపించారు. ఇక, ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రంపై మహేశ్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie New Hyderabad Schedule Starts From August 30th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X