twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరొకరిని బలి తీసుకున్న కరోనా: టాలీవుడ్‌ టాప్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

    |

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ భారీగా పెరిగిపోతోంది. మొదటి దానితో పోలిస్తే రెండో దశలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సారి సినీ రంగంపైనా ఈ మహమ్మారి విరుచుకు పడుతోంది. దీంతో సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సహా పలు విభాగాలకు చెందిన ఎంతో మంది ఇప్పటికే ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాల కోసం ఆస్పత్రుల్లో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. టాప్ సినిమాటోగ్రాఫర్‌గా పేరొందిన వీ జయరాం కోవిడ్‌ బారిన పడి మరణించారు.

    సుదీర్ఘ కాలం పాటు సినీ రంగానికి సినిమాటోగ్రాఫర్‌గా సేవలు అందించిన లెజెండరీ కెమెరామెన్ వీ జయరాం.. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆస్పత్రిలోనే తుది శ్వాసను విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా మలయాళ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అదే సమయంలో జయరాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

    Major Chandrakanth Cinematographer V. Jayaram Passes Away Due to Covid 19

    13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీ జయరాం.. ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సహంతో సినీ రంగంలో ప్రవేశించారు. ఈ క్రమంలోనే ఎన్నో విభాగాల్లో పని చేసిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'చిరంజీవి' అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని జయరాం.. ఎన్నో చిత్రాలను అద్భుతమైన కలాఖండాలుగా చూపించారు. ఆయన పని చేసిన చిత్రాల్లో 'మేజర్ చంద్రకాంత్', 'పెళ్లి సందడి' వంటి క్లాసిక్స్ ఉన్నాయి. వీటితో పాటు దాదాపు టాలీవుడ్‌లోని అప్పటి హీరోలందరితోనూ పని చేశారాయన.

    English summary
    Tollywood Cinematographer, Major Chandrakanth Fame V. Jayaram Passes Away Due to Covid 19 on Thursday Night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X