twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు దర్శకుడిగా సోషల్ మీడియా స్టార్.. కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా..కిరణ్ అబ్బవరంతో మూవీ!

    |

    తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఒక సినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం - సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్. ఎందుకు ? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే

    లాంఛనంగా ప్రారంభం

    లాంఛనంగా ప్రారంభం

    కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఒక ప్రారంభమయింది. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, మురళీ మోహన్, యస్. వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కోటి, రాజా రవీంద్ర తదితరులు హాజరై, చిత్ర యూనిట్ ను శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దర్శకుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. దర్శకుడి పేరు కార్తీక్ శంకర్ కాగా ఆయన ఒక మలయాళ సోషల్ మీడియా స్టార్.

    ఒక వరంలా వచ్చి పడిన లాక్ డౌన్

    ఒక వరంలా వచ్చి పడిన లాక్ డౌన్

    మలయాళీ యువకుడు కార్తీక్ శంకర్ కి లాక్ డౌన్ ఒక గొప్ప వరం, ఎందుకంటే ఆయన ఆ సమయంలోనే థన్ వెబ్ సిరీస్ మామ్ అండ్ సన్ తో పాపులర్ అయ్యారు. ఆయన నిజంగా తన తల్లితో కలిసి నటించిన ఈ సిరీస్ అతనికి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ వెబ్‌సీరీస్ వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియా ఫేమ్‌ వచ్చింది. నటుడు, దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ అయిన శంకర్ మలయాళ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటాలి అనుకున్నారు కానీ అనూహ్యంగా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ అంశం మీద ఆయన పలు విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

    మూడు నిముషాల షార్ట్ ఫిలింతో

    మూడు నిముషాల షార్ట్ ఫిలింతో

    తెలుగు పరిశ్రమ నుంచి సినిమా దర్శకత్వం వహించాలని కాల్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 2016 లో, నేను షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని అప్పుడే ఈ సినిమా నిర్మిస్తున్న కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలను నేను కలిశానని అన్నారు. అయితే అప్పుడు మేము సినిమాల గురించి అస్సలు మాట్లాడలేదు. కానీ వారు తమ మొదటి సినిమాని ప్లాన్ చేసినప్పుడు, నా షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అయిన కారణంగా కారణంగా వారు తన గురించి ఆలోచించారని, మంచి స్క్రిప్ట్ ఉంటే, సినిమా చేయడానికి రెడీ అన్నారని చెప్పుకొచ్చారు.

    మాస్ ప్రాజెక్ట్ కావాలనుకున్నా

    మాస్ ప్రాజెక్ట్ కావాలనుకున్నా

    అయితే ముందు తాను కొంచెం సంశయించాను ఎందుకంటే ఇది నా డైరెక్షన్ డెబ్యూ, అది కూడా నా సొంత బాష కాకుండా మరో భాషలో అని అన్నారు. అయితే చిన్నప్పటి నుండి నేను తెలుగు సినిమాలు చూసేవాడిని కాబట్టి నాకు తెలుగు అర్థమవుతుందని ఆయన అన్నారు. పెద్దయ్యాక, మా నాన్న నన్ను మరిన్ని తెలుగు, తమిళ సినిమాలు చూడటానికి ప్రోత్సహించేవారని అన్నారు. అయితే నేను సరిగ్గా మలయాళంలో సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు తెలుగు నిర్మాతల కాల్ రావడంతో నిర్మాతలను, ఒక ఫీల్-గుడ్ మూవీ డ్రాఫ్ట్‌ పంపానని, తెలుగు వాళ్లు 'మాస్' సినిమా ఇష్టపడతారని ఈ స్క్రిప్ట్ వారు తిరస్కరిస్తారని ఆశించాను కానీ వాళ్ళు దీన్ని ఇష్టపడ్డారని ఆయన అన్నారు.

    అలా మొదలైంది

    అలా మొదలైంది

    అలాగే వారు కూడా అలాంటి సబ్జెక్ట్ కోసం వెతుకుతున్నారని చెప్పడంతో ప్రాజెక్ట్ మొదలైందని అన్నారు. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా కన్నడ నటి సంజన ఆనంద్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందిస్తున్నారని అన్నారు. నేను మలయాళం కోసం వ్రాసినప్పుడు, స్క్రిప్ట్ లో చాలా రియలిస్టిక్ టచ్ ఉండేదని, అలాగే నేరేషన్ స్లోగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగు కోసం మార్పులు చేర్పులు చేసి కథ యొక్క ఆత్మను దెబ్బతీయకుండా స్కేల్‌ను పెంచామని చెప్పుకొచ్చారు.

    వాళ్ళు అది చూసి ఇవ్వలేదు

    వాళ్ళు అది చూసి ఇవ్వలేదు


    ఇక థన్ ఫేమ్ పెరిగినందువల్ల ఈ సినిమా అవకాశం రాలేదని, నేను 2016 నుండి నా వీడియోల లింక్‌లను వారికి పంపుతూనే ఉన్నానని, లాక్డౌన్ సమయంలో నాకు క్రేజ్ పెరిగింది అనే సంగతి కూడా వాళ్లకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. 2016లో నేను చేసిన మూడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఆధారంగా నాకు టాలెంట్ ఉందని వారు నిర్ధారించి నన్ను సంప్రదించారని అన్నారు. తరువాత నా తల్లితో ఒక సిరీస్ చేస్తున్నానని వారికి తెలిసిందని అన్నారు.

    English summary
    malayali social media star karthik shankar to direct kiran abbavaram movie in telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X