మంచు లక్ష్మీ కూతురి టాలెంట్.. వైరల్ వీడియో
తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని నటి మంచు లక్ష్మీ. యాంకర్‌గా ఆమె మాట్లాడే మాటలు ఎంతగానో ఫేమస్. అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న మంచు లక్ష్మీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సందడి చేసింది. తారల బెడ్ రూమ్ సీక్రెట్లను వారి అభిమానుల ముందుంచింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ చానెల్ పెట్టి అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.
నేటి సమాజంలో పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు? పిల్లలను ఎలా చూసుకోవాలి, పిల్లలతో ఎలా సమయాన్ని గడపాలి వంటివాటిపై తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తోంది. దీనిలో భాగంగా నేటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కూతురు పాడిన పాటను షేర్ చేసింది.

యూట్యూబ్ లో అడుగుపెట్టి 'చిట్టి చిలకమ్మా...' అంటూ పలకరించిన విద్య, మహా శివరాత్రి సందర్భంగా 'అయిగిరి నందిని...' అంటూ పాడిన స్తోత్రాన్ని మంచు లక్ష్మి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.ఈ వీడియో చూసిన వారంతా విద్యా నిర్వాణ తొలిసారిగా పాడుతున్నట్టు లేదని, అద్భుత ప్రతిభ ఆమె సొంతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. పాటలో వేరియేషన్స్ చూపిస్తూ, హావభావాలను ఆమె పలికించిన తీరు ఎంతగానో నచ్చిందని అంటున్నారు. ఇక ఈ పాట రికార్డింగ్ తరువాత మంచు లక్ష్మి తన కుమార్తెను కౌగిలించుకుని, ముద్దాడుతూ ఆనందబాష్పాలు రాల్చింది.


Click it and Unblock the Notifications











