twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ ఆపద్భాందవులు.. వీరే నిజమైన హీరోలు.. నెటిజన్స్ కామెంట్స్

    |

    కరోనా కష్టకాలంలో ప్రజలంతా ఇబ్బందిపడుతున్నారు. వారం రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో దినసరి కూలీలు నరకాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే డొక్కాడని రోజువారి కూలీలెంతో మంది ఉన్నారు అలాంటి వారికి ఈ లాక్ డౌన్ పెద్ద సమస్యగా మారింది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా లాంటి భయంకరమైన పరిస్థితిని అధిగమించాలంటే లాక్ డౌన్ వంటి చర్యలు తప్పనిసరి. అయితే ప్రభుత్వం కూడా పేదవారిని దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలను తీర్చేందుకు నడుం బిగించింది. మరోవైపు సెలెబ్రిటీలు కూడా ముందడగు వేశారు.

    ప్రభుత్వ సాయం..

    ప్రభుత్వ సాయం..

    మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం పేదలందరికీ ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, తెల్ల రేషన్ కార్డ్‌పై రూ. 1500 నగదు తక్షణమే ఇస్తామని ప్రకటించింది. కేసీఆర్ ప్రకటించిన ఈ నిర్ణయానికి మంచి స్పందన వచ్చింది. అయితే కొంత మంది టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించింది.

    మొదటి అడుగు వేసిన రాజశేఖర్..

    మొదటి అడుగు వేసిన రాజశేఖర్..

    టాలీవుడ్‌లో షూటింగ్స్ రద్దు చేయడంతో రోజువారి కూలీలు అవస్థలు వర్ణనాతీతం. వారిని ఆదుకునేందుకు రాజశేఖర్ ముందుకు వచ్చి మనసున్న మారాజు అనిపించుకున్నాడు. నిత్యవసరాలను తీర్చేందుకు తన చారిటీ ద్వారా పేద కళాకారులందరికీ సాయం చేస్తానని, ఎవరైనా సరే తనను సంప్రదించడని కోరాడు.

    ప్రభుత్వాలకు విరాళం..

    ప్రభుత్వాలకు విరాళం..


    యంగ్ హీరో నితిన్ తన దాతృత్వ గుణాన్ని బయటపెట్టాడు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు పది లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించాడు. కరోనాను ఎదుర్కొనే ఈ సమయంలో తన వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నట్టు పేర్కొన్నాడు.

    తాజాగా మనోజ్..

    వృద్దాశ్రమంలో ఎలాంటి సరుకులు లేవని, అక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మనోజ్ స్పందిచాడు. మతిస్థిమితం, దివ్యాంగులు, వృద్దులు ఇలా దాదాపు 350 మంది ఉన్న అమ్మ నాన్న ఆశ్రమంలో ఆహారం లేద.. సాయం చేయండి అన్నయ్య అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన మంచు మనోజ్.. దయచేసి మీ వివరాలు నాకు తెలియజేయండి.. ధన్యవాదాలు అని తెలిపాడు.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
    నిజమైన హీరోలు..

    నిజమైన హీరోలు..

    మంచు మనోజ్ స్పందించిన తీరుకు, నితిన్ విరాళానికి, రాజశేఖర్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. చేతులు కడుక్కోవాలని సూచించడం కాదు ఇలా సాయం చేయాలని కౌంటర్స్ వేస్తున్నారు. మొత్తానికి వీరంతా రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు.

    English summary
    Manchu Manoj Nithin And Rajasekhar Financial Help To Needy In Lock down. Two Telugu States impose Lock Down.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X