ప్యారడైజ్ లో మోహన్ బాబు.. 25 ఏళ్ల తర్వాత అలా..
కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు, పొలిటిషియన్, వ్యాపారవేత్త మంచు మోహన్ బాబు గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ స్పెషల్ రికార్డులున్నాయి. హీరోగా, విలన్ గా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ కీలక బాధ్యతల్లో పని చేశారు. ఆయన కెరీర్ లోనే 570కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన ఎక్కువగా విలన్ పాత్రలు, పవర్ ఫుల్ లీడ్ రోల్ పాత్రలతో చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలను సృష్టించారు.
సామాజిక అసమానతలు, పేదలు, కార్మిలకుల పక్షాన నిలచే సినిమాలు చేశారు. ప్రజలకు మేలు జరిగేలా తన సినిమాలతో ప్రభుత్వాలను అప్పట్లో ప్రశ్నిస్తూనే వచ్చారు. ఇలా వందల సినిమాల్లో నటించడమే కాకుండా 72 సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించి రికార్డు క్రియేట్ చేశారు. నటుడిగా ఉండి ఇన్ని సినిమాలను నిర్మించడం మోహన్ బాబుకే సాధ్యమైంది. ఇక 50 ఏళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటూనే వస్తున్నాను.

ప్రస్తుతం ఆయన వయస్సు 73 ఏళ్లు. అయినా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. చివరిగా మైథలాజికల్ యాక్షన్ ఫిల్మ్ కన్నప్ప చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాకు నిర్మాత కూడా మోహన్ బాబే కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా మంచు మోహన్ బాబు నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో 2వ సారి రూపుదిద్దుకుంటున్న మాస్ ఎంటర్ టైనర్ ది ప్యారడైజ్ లో నటిస్తున్నారు.
ఇప్పటికే నాని ప్యారడైజ్ చిత్రంలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారని కూతురు మంచు లక్ష్మి లీక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ది ప్యారడైజ్ చిత్రం నుంచి మోహన్ బాబు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీంతో మోహన్ బాబు లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. మోహన్ బాబు షర్ట్ లేకుండా కనిపించారు. చేతి నిండా రక్తం, చుట్టూ గన్స్, వేళ్ల మధ్యలో సిగరేట్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని పవర్ ఫుల్ గా కనిపించారు. ఓవైపు స్టైలిష్ గానూ కనిపించడం మోహన్ బాబు పాత్రపై ఆసక్తి పెరిగింది.
నాని ది ప్యారడైజ్ లో మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారని పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఇక మోహన్ బాబు షర్ట్ లెస్ గా కనిపించడం విశేషంగా మారింది. అయితే 2000 సంవత్సరంలో మోహన్ బాబు నుంచి రాయలసీమ రామన్న చౌదరి చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో మోహన్ షర్ట్ విప్పి ప్రత్యర్థులతో పోరాడే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక మళ్లీ 25 ఏళ్ల తర్వాత ది ప్యారడైజ్ తో మోహన్ బాబు షర్ట్ విప్పడం విశేషంగా మారింది. ఈ చిత్రం 2026 మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











