For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Manchu Vishnu : నేనో పెద్ద ఫూల్.. చెల్లెల్ని అలా చేస్తున్నావా అన్నారు, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది!

  |

  మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా స్థిరపడిన సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లో చేసిన డీ సినిమా లాంటి హిట్ మినహా ఆయనకు పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు అయితే లేవు. కానీ ఇప్పటికీ ఆయన అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడతానని ప్రకటించి వార్తల్లో నిలిచిన ఆయన తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో కి అతిథిగా హాజరయ్యారు.. ఈ క్రమంలో అలీ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించగా మంచు విష్ణు వాటికి ఆసక్తికరమైన సమాధానాలు కూడా ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  మురిసి పోతూ

  మురిసి పోతూ

  మంచు విష్ణు ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో విడుదలయ్యింది. ఆ ప్రోమోకు ఇప్పుడు విశేష ఆదరణ లభిస్తోంది.. ప్రారంభంలో మంచు విష్ణు బాబు అని పిలవాలా అని అలీ ప్రశ్నించగా మీరు కూడా ఏంటి అలా అంటున్నారు అని మంచు విష్ణు సిగ్గుపడుతున్నట్టు కనిపించారు.

  ఇక ఇప్పటికైనా తనను గుర్తుంచుకుని షోకి పిలవడం ఆనందంగా ఉందని అనడంతో అసలు ఈ షో మొదటి గెస్ట్ మీ అక్కని 150వ ఎపిసోడ్ కి పిలవాలని చూస్తే మోహన్ బాబు గారు ప్రస్తుతం కరోనా ఉంది కదా అని దాటవేశారు అని అలీ చెప్పుకొచ్చారు. ఇక మనిద్దరివీ సొట్ట బుగ్గల కదా అని అనడంతో అవునని మురిసి పోతూ ఉండగా మంచు మనోజ్ వి కూడా సొట్ట బుగ్గలే కదా అంటే అవును అని అన్నారు.

  టాలెంటు ఉండబట్టే కదా

  టాలెంటు ఉండబట్టే కదా

  ఇక మంచు మోహన్ బాబు కుటుంబం లో పుట్టడం ఒక వరం అనుకుంటున్నావా ? శాపం అనుకుంటున్నావా ? అని ప్రశ్నించగా భారత దేశం మొత్తం మీద నటనలో 15 మంది లెజెండ్స్ ని తీసుకుంటే అందులో నాన్నగారి పేరు కచ్చితంగా ఉంటుందని ఆయన కుమారుడిగా పుట్టడం నా అదృష్టం అని విష్ణు చెప్పుకొచ్చారు. అయితే నటుడిగా రెండు మూడు సినిమాల వరకు నాకు ఆయన పేరు పనికి వస్తుంది కానీ ఇప్పటివరకు నిలబడ్డాను అంటే అది తన టాలెంట్ వల్లే అని చెప్పుకొచ్చారు.

  అలా టాలెంటు ఉండబట్టే కదా నన్ను ఆలీతో సరదాగా షో కి పిలిచారు అని ఎదురు కౌంటర్ వేసాడు. ఇక మోహన్ బాబు గారు రాగానే లేచి నుంచుని, హడావుడి చేస్తూ మర్యాద ఇవ్వడం అనేది గుండెల్లో నుంచి వస్తుందా లేక ఆయన ముందు అది కేవలం నటన అని ప్రశ్నించగా అవును నటనే అనే అర్థం వచ్చేలా ఆయన సమాధానం ఇచ్చారు..

  గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది

  గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది

  అలాగే మంచు లక్ష్మి చేసిన పనుల్లో ఒక పది శాతం పనులు మేము చేసి ఉన్న ఇప్పటికి మా చర్మం చేసేవారని బహుశా తండ్రికి కూతుళ్లు అంటే అంత ప్రేమ ఉంటుందని, మా నాన్నకి కూతురు వీక్నెస్ అని నాకు ఆడ పిల్లలు పుట్టాకనే అర్థం అయిందని ఆయన చెప్పుకొచ్చాడు. అందుకే పోటీపడి నలుగురు పిల్లల్ని కన్నావా అని ప్రశ్నిస్తే దానికి నవ్వుతూ అది నా తలరాత అని చెప్పుకొచ్చారు.

  ఇక మొదటి సారిగా ఆమెను ఎక్కడ చూశావు, చూడగానే భార్య అని ఫిక్స్ అయిపోయావట కదా అని ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లోనే చూశానని ఆమె నిలబడే విధానం ఆమె నవ్వే విధానం చూస్తే తనను తాను మర్చిపోతా అని తన గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది అని చెప్పుకొచ్చారు.. ఆమెను చూసినప్పుడు మా నాన్న కూడా గుర్తు రాలేదని తర్వాత ప్రేమించిన విషయం ఆయనకు ఎలా చెప్పాలా అని మాత్రం టెన్షన్ పడ్డాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

  ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు ?

  ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు ?

  అయితే మోహన్ బాబు గారు ఆగు నేను మాట్లాడుతున్నాను అంటారని అంటే నా ఉద్దేశం ఏంటి అప్పుడు ఇంకా ఎవరు మాట్లాడకూడదు అనా అని ప్రశ్నించగా ఆ విషయం మీరే చెప్పాలి అని చెప్పుకొచ్చాడు. అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో బాగా నటించండి డబ్బులు దొబ్బుతున్నారు కదా అని మోహన్ బాబు అనగా ఏమి ఇచ్చారు బొచ్చు అని నేను అన్నాను అని అలీ చెప్పుకొచ్చాడు.

  అంతేగాక మంచు విష్ణు చేత కాసేపు డాన్స్ కూడా చేయిస్తూ సందడి చేయించారు అలీ.. నలుగురితో ఆపేస్తున్నారా మళ్ళీ ఇంకా ఎవరి కోసం అయినా ప్రయత్నిస్తున్నారా అంటే విష్ణు మా చెల్లెలిని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు ? నలుగురు చాలు కదా అని జగన్ అన్నారు అని విష్ణు చెప్పుకొచ్చాడు.. అయితే తనకు మరికొంతమంది పిల్లలు కావాలని తన భార్యతో అంటే ఇక నావల్ల కాదు ఇంకా ఎవరైనా చూసుకోమని ఆమె పేర్కొందని కూడా చెప్పుకొచ్చాడు.

  ఫూలిష్ నెస్ వల్లే

  ఫూలిష్ నెస్ వల్లే

  ఇక నీ కెరీర్లో కథ విన్నప్పుడే ఇది హిట్ అవుతుందని ఏ సినిమా అయినా అనిపించిందా అంటే తన సినీ కెరీర్ లో తాను చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది మంచి దర్శకులను ఎన్నుకోక పోవడం అని చెప్పుకొచ్చాడు. అలా ఎందుకు అంటే ఫూలిష్ నెస్ అని సమాధానమిచ్చాడు విష్ణు.. అలాగే రెండవ కారణం నేను ఒక సెంటిమెంటల్ ఫూల్ అని అలా నేను చేసిన పెద్ద తప్పులు నాలుగు సినిమాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.

  ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయం గురించి మాట్లాడుతూ ఎందుకు ఈ అసోసియేషన్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఎందుకు మనం తెలుగు వాళ్ళం ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ ఏర్పాటు అని అంటూ ఉండగా వాళ్లు కూడా అలాగే అనుకుంటే ఏంటి అని ప్రశ్నించారు అయితే దీని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

  మీకు విభేదాలు

  మీకు విభేదాలు

  ఇక నీకు మనోజ్ కి ఈ మధ్య పడటం లేదని మీ ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి అని ప్రస్తావించారు. అసలు ఈ విషయం మీద మేము ఎందుకు సమాధానం చెప్పాలి అని సీరియస్ అయిన మంచు విష్ణు పైకి లేస్తూ వేసుకున్న ఓవర్ కోట్ తీసి సీరియస్ అవుతున్నట్లు గా చూపించారు.. అయితే అసలు ఏం జరిగింది నిజంగా విష్ణు సీరియస్ అయ్యాడా ? వంటి విషయాలు మాత్రం త్వరలో ప్రసారమయ్యే ఈ పూర్తి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Manchu Vishnu was the guest on the show with Ali which was aired on ETV. During this sequence, Ali asked many questions and Manchu Vishnu also gave interesting answers to them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X