For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హిట్ కాంబో రిపీట్: చిరంజీవి - కొరటాల సినిమా కోసం ఆయన వచ్చేస్తున్నాడు.!

  By Manoj
  |

  మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ ఉత్సాహంతో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నారాయన. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే..

  స్టార్ డైరెక్టర్‌తో సినిమా

  స్టార్ డైరెక్టర్‌తో సినిమా

  ‘సైరా' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

  మరో సోషల్ పాయింట్‌తో వస్తున్నాడు

  మరో సోషల్ పాయింట్‌తో వస్తున్నాడు

  తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ ఇదే తరహాను ఫాలో అయ్యాడు. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమాలోనూ ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాడట. ఇందులో దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

   ఒక్కరు కాదు ఇద్దరు

  ఒక్కరు కాదు ఇద్దరు

  ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తన కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో సైతం ఆయన డబుల్ రోల్ చేశారు. ఇక, కొరటాల సినిమాలోనూ అది రిపీట్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో చిరు తండ్రి, కొడుకుగా కనిపించబోతున్నారట. ఈ రెండు పాత్రలూ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని టాక్.

  భారీ రెమ్యూనరేషన్

  భారీ రెమ్యూనరేషన్

  ఈ సినిమాను రామ్ చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు నిర్మాణ సంస్థలు పాలు పంచుకోవడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తారని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరు రెమ్యూనరేషన్ కింద కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. వీటి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

  సరికొత్త టైటిల్

  సరికొత్త టైటిల్

  ఈ సినిమాలో చిరంజీవి డుయల్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పాత్రల పేర్లు ‘గోవింద.. ఆచార్య' అని అందుకే ఈ సినిమా టైటిల్ అదే పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ పేరులోనే పోస్టర్ కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ అది కాదని ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుత రిపోర్టులను బట్టి ఈ సినిమా అసలు టైటిల్ ‘గోవిందా హరి గోవింద' అని సమాచారం. ప్రస్తుతం ఉన్నది వర్కింగ్ టైటిలేనని అంటున్నారు.

  #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
  హిట్ కాంబో రిపీట్

  హిట్ కాంబో రిపీట్

  ఈ సినిమా కోసం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. గతంలో చిరంజీవి - మణిశర్మ కాంబినేషన్‌లో ‘చూడాలని ఉంది', ‘బావగారూ బాగున్నారా', ‘అన్నయ్య', ‘ఇంద్ర', ‘ఠాగూర్' వంటి హిట్ చిత్రాలతో పాటు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక, ఇటీవల మణిశర్మ ట్రాక్ రికార్డ్ కూడా సూపర్‌గా ఉంది. దీంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

  English summary
  Megastar Chiranjeevi upcoming Movie Sye Raa Narasimha Reddy. After This movie He Starts project With Koratala Siva. upcoming film #Chiru152 will revolve around temples and endowments department and how the negligence of temples is bad for the society.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X