Mass Jathara Trailer Review: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ.. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ...
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల అభిమానులతోపాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ ఎలా ఉంది? రవితేజ, శ్రీలీల కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ అవుతుందా? అనే వివరాల్లోకి వెళితే..
రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం 'మాస్ జతర' ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా 'మాస్ జతర' ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు.

ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా పలికిన తీరు ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ట్రైలర్ ఎలా ఉందో మీరే లుక్కేయండి..


Click it and Unblock the Notifications











