RRR దెబ్బకు మాస్ మహారాజ రవితేజ పీచే మూడ్? .. రిలీజ్ డైలామాలో రామారావు ఆన్ డ్యూటీ!
తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా రిలీజ్ డేట్ల ప్రకటనతో భారీ కుదుపుకు లోనైనట్టు కనిపిస్తున్నది. ముందస్తుగా రిలీజ్ చేద్దామని భావించిన నిర్మాతలకు RRR రిలీజ్ డేట్ భారీ షాక్‌ను ఇచ్చిందనే విషయాన్ని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. RRR మూవీ కొట్టిన దెబ్బకు మీడియం బడ్జెట్ చిత్రాలు పీచే మూడ్ అంటూ రిలీజ్ డేట్లు మార్చుకొంటున్నాయి. గని, ఆచార్య చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకొన్నాయి. తాజాగా ఆ జాబితాలో మాస్ మహారాజా చిత్రం చేరింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా యూనిట్ ప్రకటన చేస్తూ..
మాస్ మహారాజా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటి చిత్రం శరత్ మండవ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతూ ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ముగింపు దశలో ఉంది. అయితే RRR సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకముందు ఈ చిత్రాన్ని మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే సోమవారం RRR డేట్ ప్రకటించిన తర్వాత ఈ యూనిట్ సందిగ్దంలో పడింది.

రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని మార్చి 25వ తేదీన గానీ, లేదా ఏప్రిల్ 15వ తేదీన గానీ రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తమ ప్రకటనలో.. మా సినిమాను మేము ప్రేమిస్తున్నాం. అదే సమయంలో ఇతర సినిమాల రిలీజ్‌పై మాకు ఎనలేని గౌరవం ఉంది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని తొలుత 25వ తేదీ మార్చిన రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ ప్రస్తుతం చోటుచేసుకొన్న పరిస్థితుల్లో మా సినిమాను మార్చి 25న గానీ, లేదా ఏప్రిల్ 15వ తేదీన గానీ రిలీజ్ చేయాలని అనుకొంటున్నాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రంజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించడం గమనార్హం.
నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్లు: ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్టీ టీమ్ వర్క్స్
మ్యూజిక్ డైరెక్టర్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్


Click it and Unblock the Notifications











