Mega 157 Title Glimpse: చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదే.. స్టైలీష్‌గా బాస్ ఎంట్రీ అదుర్స్!

సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడికి బంపరాఫర్ తగిలింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ఏంటీ? అంటూ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సస్పెన్స్‌కు తెరదించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటీ? అనిల్ రావిపూడి మార్క్ కనిపించిందా? లేదా అన్నది చూస్తే..

Mega 157 Title Glimpse mega star Chiranjeevi anil ravipudi s movie titled as Mana Shankara Vara Prasad Garu

విక్టరీ వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు? ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నారు? అంటూ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. చిరు, అనిల్ ఎక్కడ కనిపించినా మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు వేస్తుండటంతో చిరంజీవి ఈ సస్పెన్స్‌కు తెరదించారు.

లైలా ఈవెంట్‌లో చిరంజీవి ప్రకటన
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అనిల్ రావిపూడి కూడా విచ్చేశారు. వేదికపై విశ్వక్‌సేన్‌ను ఆశీర్వదించిన చిరంజీవి.. తన తదుపరి సినిమా అనిల్ రావిపూడితో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. 2025 సమ్మర్‌లో ఈ సినిమా ప్రారంభమవుతుందని, సినిమా ఆద్యంతం ఫుల్ కామెడీగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. గతంలో కోదండరామిరెడ్డితో ఎలాంటి బంధం కొనసాగిందో, అదే ఫీల్ అనిల్ రావిపూడితో కలిగిందని చిరు అన్నారు.

చిరుకు జోడీగా నయనతార
ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు? చిరంజీవి సరసన ఎవరు? నటించబోతున్నారని అప్పట్లో భారీగా కథనాలు వచ్చాయి. త్రిష, అనుష్క తదితరుల పేర్లు వచ్చాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఓ వీడియోతో షాకిచ్చారు. మెగా 157లో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రమోషనల్‌ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయన్‌తో ఏకంగా ప్రమోషనల్ వీడియో చేయించాడు అనిల్ రావిపూడి. సినిమా షూటింగ్‌ను వేగంగా పట్టాలెక్కించిన ఆయన ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసేశారు. ఇక ఈ సినిమాలో అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు అనిల్ రావిపూడి. మెగా 157లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మెగా 157 టైటిల్ ఇదే
అంతా బాగానే ఉంది కానీ .. మెగా 157 టైటిల్ ఏంటీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారింది. తొలుత ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం, బాస్‌తో ఈ పండగ రఫ్ఫాడిస్తాం, మన శివ శంకర వరప్రసాద్ గారు అనే పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిరంజీవితో మూవీ టైటిల్‌లో సంక్రాంతి లేదని స్వయంగా అనిల్ రావిపూడి చెప్పడంతో మన శివ శంకర వరప్రసాద్ గారు టైటిల్ ఖరారైనట్లుగా అర్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మెగా 157 టైటిల్‌ను మేకర్స్ విడుదల చేశారు.

సంక్రాంతికి మెగా 157
ముందుగా అనుకున్నట్లుగా మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బ్లాక్‌డ్రెస్‌లో స్టైలీష్‌గా కారు దిగుతూ, ఫుల్ సెక్యూరిటీతో చిరంజీవి నడిచొస్తున్న వీడియోను ఈ సందర్భంగా విడుదల చేశారు. దీనికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. చివరిలో పండుగకి వస్తున్నారని చెప్పడంతో .. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెర మీద చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహూ గారపాటితో కలిసి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X