Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిహారిక కోసం మెగా హీరోల పెళ్లి కానుకలు.. వాటి మొత్తం విలువ ఎంతంటే..
మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ వేడుకకు మెగా హీరోలందరు వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నిహారిక కోసం మెగా హీరోలు ఇచ్చిన పెళ్లి కానుకల గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. వాటి విలువ కూడా కోట్లల్లోనే ఉంటుందట.

ఖరీదైన పెళ్లి కానుకలు
మెగా బ్రదర్స్ కు గారాల కూతురు, యువ హీరోలకు చిట్టి చెల్లి కావడంతో నిహారిక కోసం చాలా విలువైన కానుకలు వచ్చయట. అందులో ఎక్కువగా నగలూ, నెక్లెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ లోనే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిశ్చితార్థం చేసుకున్న నిహారిక, చైతన్య ఇప్పుడు పెళ్లి వేడుకను మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు మొత్తం వేడుకలో పాల్గొన్నారు.

మెగాస్టార్ స్పెషల్ నెక్లెస్
నిహారికకు పెళ్లికి కానుకలు ఎన్ని వచ్చినా కూడా మెగాస్టార్ ఇచ్చిన కానుక మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే దాని విలువ 2కోట్ల రూపాయలు. మెగాస్టార్ ఇచ్చిన కానుక గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కూతురి కోసం 2కోట్లు విలువ చేసే నెక్లెస్ ను కానుకగా ఇచ్చారట. ఆ నెక్లెస్ ను ఆయన సతీమణి సురేఖ సలహా మేరకు స్పెషల్ గా డిజైన్ చేయించిన్నట్లు తెలుస్తోంది.

ఆధ్య చేతుల మీదుగా నీహారికకు పవన్ గిఫ్ట్
ఇక పెళ్లి పీఠలు ఎక్కిన సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన కూతురు ఆధ్య చేతుల మీదుగా కోటికి పైగా విలువ చేసే నగలను బహుకరించినట్లు సమాచారం. అలాగే అల్లుడు చైతన్యకు కూడా ఒక ఖరీదైన కానుక ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్. ఇక వేడుకలో పవన్ పెద్ద కుమారుడు అకిరా నందన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతని ఫొటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి.

రామ్ చరణ్, ఉపాసన ఏమిచ్చారో..
ఇక మెగా యువ హీరోలు నిహారిక కోసం ఎలాంటి కానుకలు ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి అరుదైన కానుకలు బాగానే ఇచ్చారట. ఎక్కువగా నిహారికకు నగలు, నెక్లెస్ లు బహుమానంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అరవింద్ కూడా నెక్లెస్ ను బహుకరించినట్లు సమాచారం.

కానుకల మొత్తం విలువ ఎంతంటే..
ఇక వరుణ్ తేజ్ తండ్రిపై ఎలాంటి భారం పడకుండా చెల్లి పెళ్లికి మొత్తం తన సంపాదనను ఖర్చు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ కూడా కపుల్స్ కు చిరకాలం గుర్తుండిపోయే అద్భుతమైన కానుకలను ఇచ్చారట. ఫైనల్ గా నిహారిక పెళ్లికి మొత్తం వచ్చి కానుకలను లెక్కిస్తే వాటి విలువ రూ.5కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక నాగబాబు ముందుగానే హైదరాబాద్ లో ఉన్న ఒక విల్లాను నిహారిక పేరు మీద రాసినట్లు సమాచారం.