Varjun Tej Net Worth: వరుణ్ తేజ్ నెట్ వర్త్.. మెగా ప్రిన్స్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ కు పెద్దగా కాలం కలిసి రావడం లేదు. దీంతో తన రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. ఇదే సమయంలో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. మెగా ఇంట మరో చిన్నారి జన్మించడం విశేషం.

సెప్టెంబర్ 10న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించడం విశేషం. దీంతో మెగా కుటుంబం మొత్తం ఆనంద ఉత్సవాల్లో మునిగి తేలుతున్నారు. సెలబ్రెటీలు, మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కెరీర్ లో పెద్ద ఎత్తున హిట్ పడలేదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోకు పడాల్సిన హిట్ ఇంకా దక్కలేదు. వరుణ్ తేజ్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు.

Mega Prince Varun Tej Net Worth

ఇక వారసుడు వచ్చిన వేళ విశేషంతో వరుణ్ బాబు కెరీర్ మరింతగా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఇదెలా ఉంటే వరుణ్ తేజ్ ఇప్పటి వరకు నటుడిగా ఎన్ని కోట్లు సంపాదించారనేది ఆసక్తికరంగా మారింది. తండ్రి నాగబాబు ఆస్తులు కాకుండా వరుణ్ తేజ్ స్వతహాగా సంపాదించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. వరుణ్ తేజ్ ప్రాపర్టీస్, కార్లు, ఇతర ఆస్తుల విలు కోట్లల్లో ఉండటం విశేషం. వాటి ధర, మొత్తం ప్రాపర్టీస్ విలువ ఎంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

జూబ్లీహిల్స్ లో వరుణ్ తేజ్ కు ఖరీదైన విలాసవంతమైన ఇల్లు ఉండటం విశేషం. ఆ ఇంటి ధర రూ.43 కోట్లు ఉంటుందంట. అది కాకుండా మరో ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక వరుణ్ తేజ్ దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మెర్సీడేజ్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ మోడల్, వోల్వో, బీఎండబ్ల్యూ 7 సిరీస్, టోయోటో విల్‌ఫైర్ వంటి కార్లు ఉన్నాయి. వీటి ధర కోట్లల్లో ఉంటుంది. ఇలా మొత్తంగా అన్నింటి విలువ రూ.57 కోట్ల వరకు ఉంటుందని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు.

ఇక వరణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఛార్జీ చేస్తుంటారు. ఆయన సంవత్సర ఆదాయం రూ.20 కోట్లు ఉంటుందని ప్రచారం. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషనే కాకుండా పలు బ్రాండ్స్ ఎండోర్స్ మెంట్ ద్వారా కూడా అధికంగానే సంపాదిస్తూ ఉన్నారు. ఇక చివరిగా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్స్, మట్కా అనే చిత్రాలతో అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. నెక్ట్స్ VT15తో రాబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X