Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సైరా ట్రైలర్ కేక.. రోమాలు నిక్కబొడిచేలా.. చిరంజీవి విశ్వరూపం
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైరా ఆడియో వేడుకను వాయిదా వేయడం మెగా అభిమానులను షాక్ గురి చేసింది. ఈ క్రమంలో అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపడానికి కొణిదెల ప్రొడక్షన్ సైరా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే..
సైరా వేడుకు 22 తేదీకి వాయిదా
‘సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని లాల్ బహద్దూర్ స్టేడియంలో నిర్వహించాలని ప్లాన్ చేసింది. అందుకనుగుణంగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. ముఖ్య అతిథుల లిస్టును కూడా విడుదల చేసింది. ట్రైలర్ కూడా ఇదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఉన్నట్టుండి ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేయడం షాక్ గురించింది.

18వ తేదీనే ట్రైలర్
ప్రీ రిలీజ్ ఈవెంట్‌తోపాటు ట్రైలర్ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు వార్తలు రావడంతో చిత్ర బృందం స్పందించింది. అభిమానుల్లో జోష్‌ను పెంచేందుకు ముందుగా అనుకున్నట్లుగా సైరా ట్రైలర్‌ను 18వ తేదీనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేక పోవడం వల్లనే ప్రీ రిలీజ్ ఈవెంట్ 22కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం పేర్కొంది.

వరల్డ్‌వైడ్‌గా రూ.190 కోట్లు
ఇక సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.

సైరాలో నటించేది వీరే..
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.