మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ 10 ఫిల్మ్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. అత్యధికంగా వసూళ్లు ఏ చిత్రానికంటే?

మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఆయన నట జీవితం ఎంతో మందికి ఆదర్శనీయంగా మారింది. మెగాస్టార్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకొని వేల మంది నటీనటులుగా మారారు. అంతంటి ఘనకీర్తి ఉన్న బాస్ పుట్టిన రోజు ఇవాళే కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రాబోయే చిత్రాల నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందాయి. విశ్వంభర చిత్రం నుంచి పవర్ ఫుల్ టీజర్, అనిల్ రావిపూడి కాంబోలోని మెగా157 టైటిల్ ను కూడా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో టాప్ 10 హయ్యేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రాలేంటనేది ఆసక్తికరంగా మారింది.

సైరా నర్సింహా రెడ్డి..
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150కి పైగా చిత్రాల్లో ఇప్పటి వరకు హయ్యేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రం సైరా నర్సింహా రెడ్డి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.244 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.

వాల్తేరు వీరయ్య..
బాస్ సెకండ్ ఇన్నింగ్స్ లో వింటేజ్ లుక్ లో వచ్చిన దుమ్ములేపిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. 125 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి రూ.232 కోట్లు వసూళ్లు చేసింది. బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

Megastar Chiranjeevi Top 10 Worldwide Highest Gross Collected Movies

ఖైదీ నెం.150
రాజకీయాల నుంచి తిరిగి చలన చిత్ర పరిశ్రమకు బాస్ రీఎంట్రీ ఖైదీ నెం.150తోనే మొదలైంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రూ.75 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 164 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ ను వసూల్ చేసింది.

గాడ్ ఫాదర్..
మలయాళ చిత్రం లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నయనతార కీలక పాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ తొలిసారిగా తెలుగులో క్యామియో రోల్ లో నటించారు. 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ నుంచి రూ.108 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వసూళ్లు చేసింది.

ఆచార్య..
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. రూ.130 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 71 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే బాక్సాఫీస్ నుంచి వసూల్ చేసింది.

ఇంద్ర..
చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రాల్లో ఇంద్ర చిత్రం ఒకటి. ఈ చిత్రం బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కింది. సొనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రూ.12 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.51.2 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ గా నిలిచింది.

ఠాగూర్..
మెగాస్టార్ కెరీర్ లో మరో ఉత్తమ చిత్రం ఠాగూర్. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, శ్రియా శరన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర నిర్మాణానికి రూ.15 కోట్ల బడ్జెట్ అవ్వగా, బాక్సాఫీస్ నుంచి రూ.51 కోట్లు గ్రాస్ వసూల్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

శంకర్ దాదా ఎంబీబీఎస్..
చిరంజీవి, శ్రీకాంత్, సొనాలి బింద్రే నటించిన చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్. మెగా అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచిన చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రానికి జయంత్ పరంజిత్ దర్శకత్వం వహించారు. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.50.8 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.

స్టాలిన్..
మాజీ ఆర్మీ ఆఫీసర్ సోషల్ ఛేంజ్ కోసం ఎలాంటి ప్రయత్నం చేశారనేదే స్టాలిన్ చిత్ర సారాంశం. ఈ సినిమాలో త్రిష క్రిష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషం.

శంకర్ దాదా జిందాబాద్..
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ ఫిల్మ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రంలో కరిష్మా కోటక్ హీరోయిన్ గా నటించింది. ప్రభు దేవా దర్శకత్వం వహించారు. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.48 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X