twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన రౌనత్‌కు ముంబైలో జీవించే హక్కు లేదు.. మహా హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు, మహారాష్ట్ర సర్కార్‌కు మధ్య మాటల యుద్ధం పెరిగింది. ముంబై పోలీసుల తీరుపై మండిపడిన తర్వాత కంగనపై శివసేన నేతలు, మహారాష్ట్ర సర్కార్ పెద్దలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా కంగన రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీరా? అక్కడ ఉండటానికి ఎవరి అనుమతి అవసరం లేదు అనే విధంగా కామెంట్లు చేశారు.

    అలాగే ముంబై పోలీసులపై నాకు నమ్మకం పోయింది. వారి ఇచ్చే భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముంబై పోలీస్ కమిషనర్ పరబ్ బీర్ సింగ్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా మారింది అంటూ కంగన ట్వీట్లు చేశారు.

    Minister Anil Deshmukh: Kangana Ranaut has no right to stay in mumbai

    కంగన రనౌత్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. ముంబై పోలీసుల పనితీరు స్కాట్‌లాండ్ పోలీసులకు ఏమాత్రం తీసుపోదు. చాలాసార్లు మహారాష్ట్ర పోలీసు విభాగాన్ని స్కాట్‌లాండ్ పోలీసులతో పోల్చారు. దేశంలోనే ఉత్తమ సేవలందిస్తున్న పోలీసుల్లో మహా పోలీసుల ఒకరు. ఓ యాక్టర్ ఏదో కామెంట్ చేస్తే మేము ఖండించాం అని అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.

    ఒకవేళ ముంబైలో గానీ, మహారాష్ట్రలో గానీ ఆ నటి అభద్రతాభావానికి గురైతే.. ఆమెకు ముంబైలో ఉండే హక్కు లేదు అంటూ కంగనను ఉద్దేశించి పరోక్షంగా అనిల్ దేశ్‌ముఖ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీన తాను ముంబైకి వస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఎవరికైనా దమ్ముంటే ఆపే ప్రయత్నం చేసుకోవచ్చు అంటూ కంగన సవాల్ విసిరారు.

    English summary
    Maharashtra Home Minister Anil Deshmukh made sensational comments on Kangana Ranaut indirectly. He says to media that, Mumbai Police has been compared to Scotland Yard Police, while our Police force is a capable one. If an actor gives a statement like this, we condemn it. If she feels unsafe in Mumbai or Maharashtra then she has no right to stay here”:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X