‘అరుణాచలంలో రజనీకాంత్‌ని అంటూ ట్రోల్ చేశారు.. డబ్బు నాకు ఫ్రీగా రాలేదు’
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం మిరాయ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పురాణాలు, ఇతిహాసాలు ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీయా శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించగా.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.
50 సినిమాల టార్గెట్
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా దూసుకెళ్తున్న టీజీ విశ్వప్రసాద్ 50 సినిమాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, సినిమాలపై ఆసక్తితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై పలు చిత్రాలను నిర్మించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన కెరీర్‌లో ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. తాను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశానని.. అక్కడ సంపాదించిన డబ్బుతోనే ఈ వ్యాపారం మొదలుపెట్టానని విశ్వప్రసాద్ పలుమార్లు వెల్లడించారు.

మూడు సినిమాలు దెబ్బకొట్టాయి
2024లో తాను చేసిన చిత్రాలు దారుణ పరాజయంతో పాటు నాకు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయని విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. రవితేజ హీరోగా నిర్మించిన ఈగల్‌తో భారీగా నష్టపోయానని, అయితే ఆ వెంటనే ఆయనతోనే చేసిన మిస్టర్ బచ్చన్‌తో కోలుకుంటానని అనుకున్నానని.. కానీ ఆ సినిమా రిజల్ట్ కూడా నిరుత్సాహపరిచిందని విశ్వప్రసాద్ అన్నారు. ఆ వెంటనే శ్రీవిష్ణు హీరోగా వచ్చిన స్వాగ్ కూడా నష్టాలను తెచ్చిందని.. అలా సింగిల్ ఇయర్‌లో ఈ స్థాయిలో నష్టాలను భరించడం అంత తేలిక కాదని ఆయన పేర్కొన్నారు.
భారీ వసూళ్లతో మిరాయ్
ఈ క్రమంలోనే తేజా సజ్జాతో తీసిన మిరాయ్‌పై ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయన నమ్మకం వమ్ము కాకుండా మిరాయ్ విజయం సాధించింది. 65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తోంది. మిరాయ్ ఊపు చూస్తుంటే రెండ్రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.
ఏడాదికి 10 సినిమాలు తీశా
2017లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీని స్థాపించా. ఎన్ఆర్ఐలు, ఐటీ ఫీల్డ్‌లో ఉన్న వారు సినిమాల్లోకి ఎందుకు వస్తారని నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఈ సమయంలో గూఢచారితో నమ్మకం, క్రెడిబిలిటీ వచ్చింది. ఏడాదికి పది సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే దురదృష్టవశాత్తూ నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడంతో 2024లో సినిమాలు బాగున్నప్పటికీ భారీ నష్టాలు వచ్చాయి. ఈ దశలో కార్తీక్ ఘట్టమనేని నన్ను నిలబెట్టాడు. కార్తీకేయ 2 సమయంలో బడ్జెట్ లిమిట్ అప్పటికే దాటిపోయిందని, ఓ సీన్ ఖచ్చితంగా తీయాల్సి ఉంది. ఆ సమయంలో కార్తీక్ ఈ సమస్యకు పరిష్కారం చూపించాడు. ఓఆర్ఆర్‌కు బయట నల్లరాయి కనిపించే ప్లేస్‌లో దానిని తీశాడు. కార్తీకేయ 2, గూఢఛారి సినిమాలలో తను తీసిన సీన్స్ నచ్చే మిరాయ్‌కి అతనికి అవకాశం ఇచ్చానని విశ్వప్రసాద్ గుర్తుచేసుకున్నారు.
ట్రోలర్స్‌కు కౌంటర్
ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు నేను గర్వపడేలా చేశాడు. నాపై ఎంతో ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్, రీల్స్ వదిలారు. అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించాలంటే డబ్బులు ఎలా ఖర్చుపెట్టాలో అంటూ నాపై రీల్స్ చేశారు. 2000 రూపాయల ఇంటర్న్‌షిప్‌తో నా కెరీర్ స్టార్ట్ చేశాను.. నెలకు 2000 డాలర్లతో అమెరికాలో నా కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చాను. నాకు ఫ్రీ మనీ ఎక్కడా దొరకలేదు.. డబ్బు ఎలా సంపాదించాలో? ఎలా ఖర్చుపెట్టాలో నాకు బాగా తెలుసు' అని తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై విశ్వప్రసాద్ ఇచ్చిపడేశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











