అంత గొప్ప మనసు ఎవరికుంటుంది, ఫామిలీ మెంబర్ ని అన్నాడు...చిరు, సూర్య గురించి మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సన్నాఫ్ ఇండియా' సినిమా టీజర్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదలైంది. 'మన అంచనాలకు అందని వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు' అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలు కావడం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ టీజర్ రిలీజ్ నేపథ్యంలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

కసక్ అంటే మీరందరూ ఫసక్
''తాను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక' అంటూ చిరంజీవి ఇచ్చిన వాయిర్ ఓవర్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. ఇక 'నేను చీకటిలో ఉండే వెలుతురిని, వెలుతురులో ఉండే చీకటిని' అంటూ మోహన్ బాబు ఇందులో తనదైన శైలిలో డైలాగ్ చెప్పడమే కాక 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అవుతారంటూ కూడా చెప్పిన డైలాగ్ రచ్చ రేపుతోంది.

స్పెషల్ నోట్
అయితే ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి గురించి అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్య గురించి మోహన్ బాబు ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. తాను చేస్తున్న సినిమా గురించి అభిమానులకు ప్రేక్షకులకు తెలుసని అన్న ఆయన సినిమా ప్రారంభంలో ఒక వాయిస్ ఓవర్ అవసరమైతే విష్ణు వెంటనే చిరంజీవి గారి వాయిస్ బాగుంటుందని అన్నాడు అని చెప్పుకొచ్చారు.

మూడు రోజుల్లోనే
వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి అడిగితే ఎన్ని రోజుల్లో కావాలి అని అడిగాడని 10 రోజుల్లో ఎప్పుడైనా సరే నని చెప్పానని చెప్పుకొచ్చారు. ఆ వాయిస్ ఓవర్ మేటర్ నాకు పంపు అంటే పంపానని అయితే ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి నేను అడిగిన మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా థియేటర్ బుక్ చేసి డబ్బింగ్ చెప్పి పంపాలి అనుకున్నాడని అన్నారు.

సర్ ప్రైజ్ చేద్దామనుకున్నా
ఆ మేటర్ నాకు తెలిసి డబ్బింగ్ ధియేటర్ కి విష్ణు పంపాను విష్ణుని అక్కడ చూడగానే చిరంజీవి నవ్వుతూ నిన్ను ఎవరు రమ్మన్నారు అని చేసి మీ నాన్నకి సర్ ప్రైజ్ చేద్దామనుకున్నాను అని చెప్పారని అన్నారు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది నేను అడగగానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకి అతని సహృదయతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మోహన్ బాబు రాసుకొచ్చారు.
Recommended Video
మీరు చెప్పండి చాలు
అలాగే ఈ టీజర్ని మీ చేతుల మీదుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నాను సూర్య కి ఫోన్ చేస్తే వెంటనే ఆయన మీరు ఎందుకు సార్ పెద్దవారు నాకు చెబుతారు నేను మీ ఫ్యామిలీ మెంబర్ ని నేను విష్ణుతో మాట్లాడుకుని ప్లాన్ చేస్తాను అంటూ ఆయన అన్నారని చెప్పుకొచ్చారు. మీరు చెప్పిన టీజర్ రిలీజ్ అవుతుంది అని చెప్పి అదే సమయానికి టీజర్ రిలీజ్ చేశాడు సూర్య నా మీద ఉన్న ప్రేమకి ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు, అలాగే మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











