మోహన్ బాబు ఇంటికి మోహన్ లాల్.. లేజెండ్రీగా ఇలా ప్లాన్ చేశామంటూ!

ఇప్పుడంటే కాస్త సినిమాలు తగ్గించారు కానీ ఒకప్పుడు తెలుగులో డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం అయిన తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ భాషలో కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇతర భాషలకు చెందిన హీరోలతో కూడా మంచు మోహన్ బాబు అనేక సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

మరీ ముఖ్యంగా మంచు మోహన్ బాబు - రజినీకాంత్ స్నేహ బంధం గురించి టాలీవుడ్ లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మోహన్ బాబు కేవలం రజినీకాంత్ తోనే కాక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి వారితో కూడా ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వీరంతా 80s బ్యాచ్ అంటూ తరచూ కలుసుకుంటూ ఉంటారు అన్న సంగతి కూడా దాదాపు అందరికీ తెలిసిందే.

Mohanlal Dinner With Mohan Babus family manchu lakshmi shares photos

అయితే ఇప్పుడు మోహన్ బాబు ఇంటికి మోహన్ లాల్ విచ్చేసి మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని ఖుషీ చేశారు. సందర్భం ఏమిటి అనే విషయం బయటికి రాలేదు కానీ మోహన్ బాబు కుటుంబంతో మోహన్ లాల్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి.

అయితే మోహన్ లాల్ హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చారని ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ బాబు ఇంటికి డిన్నర్ కోసం వచ్చారు అని ప్రచారం జరుగుతోంది, మోహన్ లాల్ తో పాటు మోహన్ బాబు ఆయన భార్య, విష్ణు ఆయన భార్య అలాగే మంచు లక్ష్మి కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలు అన్నిటినీ మంచు లక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా కొద్దిసేపటి క్రితం పంచుకున్నారు.

Mohanlal Dinner With Mohan Babus family manchu lakshmi shares photos

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు Mలు ఒక లెజెండ్రీ డిన్నర్ కోసం కలుసుకున్నారని చెబుతూ ఆమె ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక మోహన్ లాల్ లూసిఫర్ సినిమా ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తూ ఉండగా ఆయన నటించిన దృశ్యం 2 సినిమాని వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. అలాగే మోహన్ లాల్ గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన గాండీవం అనే సినిమాలో కూడా ఒక పాటలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Mohanlal Dinner With Mohan Babus family manchu lakshmi shares photos

గాండీవం సినిమాలో గోరువంక వాలగానే గోపురానికి గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా ..అనే పాటలో అక్కినేని నాగేశ్వరరావుతో కనిపించారు. ఇక విష్ణు ఈ మధ్యకాలంలో నిర్మాతగా మారగా మోహన్ బాబు ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మంచు ఫ్యామిలీ అంత నమ్మకం పెట్టుకుంది. మరో పక్క మంచు లక్ష్మి కూడా దాదాపు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆమె తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాని ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

Mohanlal Dinner With Mohan Babus family manchu lakshmi shares photos

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X