MoneyHeist season5 :మనీ హీస్ట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆఖరి సీజన్ రిలీజ్ డేట్ వచ్చేసింది !
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ లో ''మనీ హీస్ట్ '' వెబ్ సిరీస్ కూడా ఒకటి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ స్పానిష్ క్రైమ్ డ్రామాకి ఇండియా వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ కు ఐదో సీజన్ ఉంటుందని నాలుగో సీజన్ ఎండింగ్ లో క్లారిటీ ఇచ్చారు. ఇక ఐదో సీజనే ఫైనల్ సీజన్. ఇక ఈ 5వ సీజన్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2017 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న మనీహీస్ట్ వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. మొదట సీజన్ కేవలం లోకల్ గానే హిట్ అయ్యింది. కానీ తరువాత ఈ సిరీస్ మీద నెట్ ఫ్లిక్స్ ఫోకస్ పెట్టడంతో వరుసగా నాలుగు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో హిట్టవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక ఇప్పటికే 4 సిజన్లను విజయవంతం పూర్తి చేసుకున్న మనీహీస్ట్ 5వ సీజన్ తో అలరించేందుకు సిద్దం అయింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సీజన్ 5 రెండు భాగాలుగా రిలీజ్ కానుండగా మొదటి భాగం సెప్టెంబర్ నెలలో మూడో తేదీన, అలాగే రెండో భాగం డిసెంబర్ నెలలో మూడో తేదీన రిలీజ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.


Click it and Unblock the Notifications











