Don't Miss!
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- News
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
- Sports
సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌తో టీమిండియాకు ప్రమాదమే!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఓటీటీ డేట్ ఫిక్స్: అందులో స్ట్రీమింగ్ కాబోతున్న అఖిల్ సినిమా
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 'అఖిల్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాలతో పరిచయమైన అతడికి భారీ షాక్ తగిలింది. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వచ్చాడు. అయినప్పటికీ మొదటి చిత్రంతో పాటు ఆ తర్వాత వచ్చిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' చిత్రాలతో నిరాశనే ఎదుర్కొన్నాడు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో అతడి కెరీర్ ప్రశ్నార్థంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజాయన్ని సొంతం చేసుకోవాలన్న కసితో అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పెళ్లైనా తగ్గని స్టార్ హీరోయిన్: జాకెట్ విప్పేసి మరీ బ్రాతో ఘాటుగా.. మరీ ఇంత రచ్చ అవసరమా!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. అయితే, ఆ తర్వాత కొన్ని రీషూట్స్‌తో పాటు పలు ఆటంకాలు ఎదురు కావడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యాయి. దీంతో సినిమా కూడా అనుకున్న టైమ్‌కు విడుదల కాలేదు. ఇక, ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది.

ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం వేచి చూస్తోన్న అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సంతృప్తిని కలిగించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. ఫలితంగా ఈ యంగ్ హీరో ఖాతాలో మొట్టమొదటి విజయం వచ్చి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ఇక, దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. దీనిపై అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
హాట్ షోలో బౌండరీ దాటేసిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో మొత్తం కనిపించేలా ఘాటు ఫోజు
ఫీల్ గుడ్ రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి క్లారిటీ వచ్చేసింది. థియేటర్లలో తెగ సందడి చేసిన ఈ సినిమా నవంబర్ 19 నుంచి తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుందట. దీంతో ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అక్కినేని అఖిల్ హీరోగా క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇక, ఇందులో ఇషా రెబ్బా, ఫరియా అబ్దాల్లా సహా పలువురు నటీమణులు కామియో రోల్స్ చేసిన విషయం తెలిసిందే.