Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం.. ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి మరణం.. ఆ ప్రేమపై SPB అప్పట్లో ఏమన్నారంటే
మ్యూజిక్ మాస్ట్రో ఎఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటు చేసునుంది. ఒక్కసారిగా సినీ ప్రపంచంలో ఈ చేదు వార్త అందరిని షాక్ కు గురి చేసింది. ఎందుకంటే రెహమాన్ కు ప్రాణానికి ప్రాణమైన ఆయన తల్లి కరీమా బేగం సోమవారం కన్నుమూశారు. ఆస్కార్ అవార్డు పొందిన ఏకైక భారత సంగీత కళాకారుడిగా ఎంతగానో గుర్తింపు అందుకున్న రెహమాన్ కు తల్లి అంటే చాలా ఇష్టం. దైవం కంటే ఎక్కువగా పూజించే అమ్మను కోల్పోవడంతో అతన్ని ఒక్కసారిగా మనోవేదనకు గురి చేసింది.

ఫొటోను షేర్ చేసిన రెహమాన్
సోషల్ తన ట్విట్టర్ పేజీలో ఫోటోను పంచుకోవడం ద్వారా తన తల్లికి నివాళి అర్పించారు. రెహమాన్ ఎల్లప్పుడూ తన తల్లితో సన్నిహితంగా ఉండేవాడు. తన స్టేజ్ షోలలో అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలను అందుకునేటప్పుడు ఆమెను తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కరీమా బేగం అసలు పేరు కస్తూరి. ఆమె భర్త ఎఎస్.శేఖర్. దిలీప్ కుమార్ గా పుట్టిన రెహమాన్ పేరును కూడా ఆమె తరువాత మార్చారు.

ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో..
ఇక రెహమాన్ చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో ఆ బాధ్యతను తల్లి తీసుకుంది. ఆమె కూడా సంగీత కళాకారిణి. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో కొడుకు కూతుళ్ళను ఆమె కష్టపడి పోషించారు. ఇక టీనేజ్ వయసులోనే సంగీత వైపు ఫోకస్ పెట్టిన రెహమాన్ పాతికేళ్ల వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నాడు.

రెహమాన్ తల్లి ప్రేమ.. బాలు ఏమన్నారంటే..
రెహమాన్ కు తన తల్లి అంటే పంచ ప్రాణాలు. ఒకసారి ఈటీవీ స్వరాభిషేకం సమయంలో గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, రెహమాన్ గొప్పతనం గురించి తెలియజేస్తూ అతనికి తల్లిపై ఉన్న ప్రేమ గురించి కూడా చక్కగా వివరించారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే ప్రతిరోజు పక్కనే ఉండడానికి ఇష్టపడేవారట.

ఇంట్లోనే ICU ఏర్పాటు..
ఎస్పీ బాలు ఇంకా ఏమన్నారంటే.. నిత్యం సంగీత ప్రపంచంలో బిజీగా ఉండే రెహమాన్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదంటే ఇంట్లోనే ఒక ICUని ఏర్పాటు చేశాడు. ఇద్దరు స్పెషల్ డాక్టర్లతో పాటు నర్సులు కూడా ఉండేవారు. రికార్డింగ్ అయిపోగానే వెంటనే తల్లిని చూసుకునేవారు. తల్లి అంటే అతనికి అంత ఇష్టమని, అప్పుడు ఆమె త్వరగానే కోలుకున్నట్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాభిషేకం ఈవెంట్ లో గుర్తు చేసుకున్నారు.