Who is Harini Reddy? ప్రియురాలితో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్.. కాబోయే భార్య హరిణి రెడ్డి ఎవరో తెలుసా?
తెలుగు సినిమా రంగంలో యువ గాయకుడు, బిగ్‌బాస్ తెలుగు విన్నర్, ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నారు. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న తన స్నేహితురాలిని జీవిత భాగస్వామిగా చేసుకొనేందుకు నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల సమ్మతితో తన ప్రియురాలు హరిణి రెడ్డిని వివాహం చేసుకొనేందుకు సిద్దమయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా రాహుల్ తన ప్రేయసి హరిణ్య రెడ్డితో పెళ్లి నిశ్చితార్థం జరుపుకొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్‌తో పలువురు టెలివిజన్, సినీ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో అఫైర్, డేటింగ్ వార్తలు వచ్చాయి. యువ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం మీడియాలో చాలా రోజులుగా నానుతున్నది. సదరు నటి కూడా రాహుల్‌తో బాండింగ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకొన్నది. కానీ ఊహించని విధంగా రాహుల్ నిశ్చితార్థం హరిణి రెడ్డితో జరగడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాంతో ఎవరీ హరిణి రెడ్డి అనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.
తెలుగు ఇండస్ట్రీలో టాప్ సింగర్‌గా రాణిస్తున్న రాహుల్ సిప్లిగంజ్‌ను వివాహం చేసుకోనున్న హరిణి రెడ్డి.. తన స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మనసులు కలుసుకొనేలా చేసింది. అయితే హరిణి రెడ్డికి సిని రంగానికి, రాజకీయ రంగానికి సంబంధాలు లేవు. వ్యాపారం రంగానికి చెందిన సాధారణ ఫ్యామిలీకి చెందిన వారని ప్రాథమికంగా తెలిసింది. హరిణి రెడ్డితో అఫైర్‌ను రాహుల్ చాలా సీక్రెట్‌గా మెయింటెన్ చేయడం.. ఏకంగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలకు సర్‌ప్రైజ్‌గా మారింది.
హరిణి రెడ్డితో రాహుల్ నిశ్చితార్థం ఆగస్గు 17వ తేదీన హైదరాబాద్‌లోని ప్రైవేట్ హోటల్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. నిశ్చితార్థం తర్వాత స్నేహితులు షేర్ చేసిన ఫోటోల ద్వారా వారి ఎంగేజ్‌మెంట్ న్యూస్ బయటకు లీక్ అయింది. దాంతో వారి ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తాయి.
నిశ్చితార్థం సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్, హరిణి రెడ్డి ఇద్దరు అందంగా ముస్తాబయ్యారు. రాహుల్ షేర్వాణి ధరించగా.. హరిణి ఆరెంజ్ కలర్ లహెంగాతో కూడిన డిజైనర్ దుస్తులు, ఆభరణాలు ధరించి అందర్నీ ఆకట్టుకొన్నారు. త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు అని స్నేహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











