twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్ కావాల్సిందే.. వద్దంటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి : నాగ్ అశ్విన్

    |

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే భారత ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్ లో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారుతూ ఉండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ లాక్ డౌన్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా ప్రకటించకపోయినా ఒక రెండు వారాల పాటు అందరూ పర్సనల్ గా లాక్ డౌన్ పాటిస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అలా కనుక చేయగలిగితే గత నెల రోజులుగా అవిశ్రాంతంగా పని చేస్తున్న డాక్టర్లకు కాస్త విశ్రాంతి కలిగించిన వాళ్ళమవుతాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి లాక్ డౌన్ వద్దు అంటున్న వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి చూస్తే అక్కడి పరిస్థితులు అవగతమవుతాయి అని పేర్కొన్నారు. గత నెల రోజులుగా వాళ్లు ఎంత ఎక్కువ పని చేస్తున్నారో అర్థమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రెండు వారాల పర్సనల్ లాక్ డౌన్ సమయంలో అందరూ వీలైనంత ఎక్కువగా వ్యాక్సిన్ వేయించుకోగలిగితే డాక్టర్లకు కాస్త ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతామని ఆయన చెప్పుకొచ్చారు.

    Nag Ashwin says Next 2 weeks should be a personal lockdown

    హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్

    సినిమాల విషయానికి వస్తే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఈ సినిమా ఒక ప్యాన్ వరల్డ్ సినిమా అంటూ ప్రకటించిన సమయంలో పేర్కొన్నారు. ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ఆది పురుష్ కూడా ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Mahanati fame Nag Ashwin made some comments on lockdown. ''Whether the government declares it or not...next 2 weeks should be a personal lockdown...For those of you who say lockdown is not the answer, pls go see the hospitals and how overworked they have been the past month..While we mass vaccinate, we must give the doctors some relief'' he stated on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X