For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు.. పవన్‌ కళ్యాణ్‌పై ట్రోలింగ్.. వివరణ ఇచ్చిన నాగబాబు

  |

  దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ నలుగురు రాక్షసులను ఎన్‌కౌంటర్ చేసే దాకా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే సమాజం కోరిన విధంగా చేసినా మళ్లీ నిరసనలు, నినాదాలు మొదలయ్యాయి. మానవ హక్కుల సంఘం అంటూ కొందరు నిద్ర లేచి పోలీసుల తీరును తప్పబడుతున్నారు. ఇదంతా ఓ సంగతి అయితే దిశ నిందితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

  బెత్తం దెబ్బలు చాలు..

  బెత్తం దెబ్బలు చాలు..

  ‘రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు' అని పవన్ కళ్యాణ్ అన్నట్టు ప్రచురితమైంది. ఈ వార్తను ఆధారంగా చేసుకుని కొంతమంది రాజకీయ నేతలు, పవన్ కళ్యాణ్‌ను ద్వేషించేవారు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ ఓ వర్గం పనిగట్టుకుని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.

  స్పందించిన నాగబాబు..

  స్పందించిన నాగబాబు..

  మెగాబ్రదర్ నాగబాబు ఇలాంటి వాటిపై తక్షణమే స్పందిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ‘కళ్యాణ్ బాబు ఏమన్నాడు.. మీరు ఏం చెప్తున్నారు.. అనే విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అర్థంకాక, పూర్తిగా తెలియక మాట్లాడేవాళ్లు చాలా మంది అయితే.. ఒక వీడియో క్లిప్‌ని ఎడిట్ చేసి వాళ్లకు కావాల్సిన రీతిలో పెట్టుకున్నవాళ్లు ఒకరు. దిశ రేప్ కేసులో నిందితుల గురించి కళ్యాణ్ బాబు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అని మీరు తెలుసుకుంటే ఇలా నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడరు'అంటూ ఫైర్ అయ్యాడు.

   ఆ సమయంలో నేనూ అక్కడే..

  ఆ సమయంలో నేనూ అక్కడే..

  దిశ రేప్ కేసు నిందితుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నానని నాగబాబు చెప్పుకొచ్చాడు. ‘ఒక ఆడపిల్లను అత్యంత ఘోరంగా రేప్ చేసి, కిరోసిన్ పోసి తగలబెట్టి హేయమైన, క్రూరమైన చర్య చేసిన వాళ్లను కళ్యాణ్ బాబు నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటాడా? మీకసలు బ్రెయిన్ ఉందా? కళ్యాణ్ బాబుపై ఇలా కామెంట్ చేస్తోన్న ప్రతివాడికి చెప్తున్నా.. మీకసలు బ్రెయిన్ ఉందా? కొంచెమైనా ఆలోచిస్తున్నారా? మీ ఒక్కరికేనా సామాజిక బాధ్యత.. మాకు లేదా? మాకు తెలీదా ఏం మాట్లాడాలో?' అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
  సింగపూర్ తరహాలో..

  సింగపూర్ తరహాలో..

  ‘ఒక ఆడపిల్లని రేప్ చేసే పరిస్థితి వరకు తీసుకురావడం, చంపేయడం, అలా చేసినవాళ్లను ఉరిశిక్ష వరకు తీసుకువెళ్లడం.. అసలు ఇంతదూరం వెళ్లడం ఎందుకు. ఒక ఆడపిల్ల ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఆమెకు చిన్నపాటి అసౌకర్యం కలిగించినా, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు వంటి తప్పులు చేసినా సరే సింగపూర్ తరహాలో బెత్తం దెబ్బలు (కేనింగ్) కరెక్ట్‌గా కొడితే.. ఆడపిల్ల వైపు చూడటానికి కానీ, ఆడపిల్లను ఏమైనా అనడానికి కానీ ధైర్యం చేయకుండా ప్రతివాడు జాగ్రత్త పడతాడు. అక్కడే కదా కేర్ తీసుకోవాలి.. చంపేయమని అందరూ చెబుతారు.. ఈ ప్రభుత్వాలు ఉన్నది దేనికి? ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి కదా అని కళ్యాణ్ బాబు చెప్పాడు'అంటూ ఆ మాటల వెనుకున్న అర్థాన్ని వివరించి చెప్పాడు.

  English summary
  Naga Babu Gives Clarity On Pawan Kalyan Comments Over Death Penalty. He Explained Pawan Comments On Disha Incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X