twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అశ్వద్ధామ'లో పవన్ కళ్యాణ్ వాయిస్.. ఫస్ట్‌టాక్ ఎలా ఉందంటే!

    |

    Recommended Video

    Naga Shaurya's Aswathama Twitter Talk

    విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య తాజాగా 'అశ్వద్ధామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా నేడు (జనవరి 31) విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన జనం వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు చూస్తే..

    పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌.. మూవీ స్టార్ట్

    పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌.. మూవీ స్టార్ట్

    గత సినిమా 'నర్తనశాల'తో ఎదుర్కొన్న పరాజయాన్ని 'అశ్వద్ధామ' సినిమాతో మరిపించాలని రంగంలోకి దిగాడు నాగశౌర్య. 133 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ లకు థాంక్స్ తెలుపుతూ మొదలై.. అలా స్టార్ట్ కాగానే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌లో ఓ డైలాగ్ ఆదిలోనే ఆకట్టుకుందని అంటున్నారు.

    నీరసంగా.. ఆ తర్వాత

    నీరసంగా.. ఆ తర్వాత

    ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ కథనం మాత్రం కాస్త నెమ్మదిగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు ప్రీమియర్స్ చూసిన జనం. మొదలు పెట్టడమే చాలా నీరసంగా మొదలుపెట్టారని, కాకపోతే కాసేపటి తర్వాత సినిమా వేగం అందుకుందని అంటున్నారు.

    ఫస్టాఫ్ సస్పెన్స్ రైడర్.. 30 నిమిషాల్లో

    ఫస్టాఫ్ సస్పెన్స్ రైడర్.. 30 నిమిషాల్లో

    'అశ్వద్ధామ' సినిమా కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉందని, స్టార్ట్ అయిన 30 నిమిషాల్లో సినిమా ఊపందుకొని పలు సన్నివేశాలు ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఫస్టాఫ్ సస్పెన్స్ రైడర్ అని చెబుతున్నారు.

    మాస్ అవతారంలో నాగశౌర్య

    మాస్ అవతారంలో నాగశౌర్య

    యంగ్ హీరో నాగశౌర్య తొలిసారి పూర్తిగా మాస్ అవతారంలోకి మారి చెప్పుకోదగ్గ పర్‌ఫార్‌మెన్స్ కనబర్చడాని అంటున్నారు. ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఈ హీరో నటన బాగుందని టాక్ వస్తోంది. మొత్తంగా మాత్రం సినిమా యావేరేజ్ అంటున్నారు.

    పోరాట సన్నివేశాలు.. మెహ్రీన్ నటన

    పోరాట సన్నివేశాలు.. మెహ్రీన్ నటన

    నాగశౌర్య మరియు విలన్ మధ్య పోరాట సన్నివేశాలు ఫర్వాలేదనిపించాయని టాక్ వస్తోంది. చిత్రంలోని కొన్ని చేజింగ్ సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. హీరోయిన్ మెహ్రీన్ నటన కూడా ఫర్వాలేదని చెబుతున్నారు ఆడియన్స్.

    నాగశౌర్య సొంత కథ.. స్వయంగా ఆయనే

    నాగశౌర్య సొంత కథ.. స్వయంగా ఆయనే

    అన్యాయం జరుగుతుంటే తప్పని ప్రతిఘటించిన ప్రతి ఒక్కరూ అశ్వద్దాములే అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించిన హీరో నాగశౌర్య.. ఈ కథను కూడా తానే రాసి దర్శకత్వ బాధ్యతలను రమణ తేజ చేతుల్లో పెట్టడం విశేషం.

    English summary
    Young hero Naga Shaurya's latest movie Aswathama. Today (jan 31) this movie released and getting first responce as.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X