twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాడ్సేపై ట్వీట్.. ఆత్మ రక్షణలో నాగబాబు.. ఘాటుగా విజయశాంతి కౌంటర్

    |

    మెగా బ్రదర్ నాగబాబు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడినట్టు కనిపిస్తున్నారు. ఆయన జాతిపిత మహాత్మా గాంధీ హంతకుడు నాధురాం గాడ్సేను కీర్తిస్తూ చేసిన ట్వీట్ అత్యంత వివాదాస్పదమైంది. పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు, గాంధేయవాదులు ఆయన అభిప్రాయాన్ని తప్పుపట్టారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌పై నాగబాబు వివరణ ఇవ్వగా.. ఆయన కౌంటర్‌గా సినీ నటి, రాజకీయవేత్త విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఒకసారి వారి ట్వీట్ల విషయానికి వస్తే..

    గాడ్సే దేశభక్తుడు

    గాడ్సే దేశభక్తుడు

    నటుడు నాగబాబు మే 19న ట్వీట్ చేస్తూ.. ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

     వివాదాస్పద ట్వీట్‌పై నాగబాబు వివరణ

    వివాదాస్పద ట్వీట్‌పై నాగబాబు వివరణ

    తన ట్వీట్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలను నేపథ్యంలో మరోసారి నాగబాబు ట్విట్టర్‌లో స్పందించారు. నాధురాం గాడ్సే బర్త్ డే రోజున చేసిన ట్వీట్ విషయంలో.. దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్‌లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే నాకు చాలా గౌరవం. వాస్తవానికి నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం అని నాగబాబు పేర్కొన్నారు.

    విజయశాంతి కౌంటర్

    విజయశాంతి కౌంటర్

    ఇలా నాగబాబు వివాదం కొనసాగుతుండగానే.. సినీనటి, రాజకీయ వేత్త విజయశాంతి మహాత్మా గాంధీ గురించి ట్విట్ చేశారు. కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్. ''నాకు కూడా''...''అని''గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా Folded hands అంటూ విజయశాంతి ట్వీట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    Nathuram Godse Has Patriotism, Media Didn't Project His View That Time: Nagababu
    రాజకీయ ప్రయోజనాలు ఆశించే

    రాజకీయ ప్రయోజనాలు ఆశించే

    ఇక నాధురాం గాడ్సేను కీర్తిస్తూ.. నాగబాబు వివరణ ఇచ్చినప్పటికి నెటిజన్ల ట్రోలింగ్ ఆపడం లేదు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ ట్వీట్ చేసుంటారనేది స్పష్టమవుతుందని పలువురు బహిరంగంగానే విమర్శించారు. బీజేపీకి దగ్గర కావడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే విషయాన్ని పరోక్షంగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా నాధురాం గాడ్సే వ్యవహారంలో నాగబాబు చేసిన ట్వీట్ అనేక వర్గాల ఆగ్రహానికి కారణమవుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

    English summary
    Actor Nagababu has given clarity contraversial tweets on Nathuram Godse. He asked to understand his views on Godse. Nagababu said, I have lot of faith on Gandhiji. In this occassion, Vijayashanti counters to Godse remarks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X