థ్రిల్లింగ్‌గా కర్త కర్మ క్రియ టీజర్.. యధార్థ సంఘటనల ఆధారంగా..

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తొన్న కర్త క్రియ కర్మ సినిమా టైటిల్ ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. "వీకెండ్ లవ్" ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. "మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసేలా ఉంటుంది. "కర్త కర్మ క్రియ"టీజర్ ను విడుదల చెస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె పాటలను విడుదల చెస్తామన్నారు.

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కల్పిత కధ ఇది. మనం రోజు చూసే, వింటున్న సమకాలీన క్రైమ్‌కు సంబంధించిన ఎలిమెంట్ తో ఈ కర్త కర్మ క్రియ ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ మా సినిమాకు సెట్ కావటంతో పాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం. పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చేశాం. హీరో, హీరోయిన్లు కొత్త వారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Nagu Gavara Kartha Karma Kriya Teaser released

టెక్నికల్ గా అంతే ఉత్తమం గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీశాము. ఈ ఫస్ట్ టీజర్ ను ఈ రోజు విడుదల చెస్తున్నాము. మాటీమ్ అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు.

నటీనటులు

వసంత్ సమీర్, సెహర్, నూతన్ రాయ్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్, శ్రీసుధ, కాశీవిశ్వనాధ్, సంధ్య పెద్దాడ, రమణారెడ్డి, కృష్ణతేజ, లోహిత్, మహేందర్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: అనీ , కాస్ట్యూమ్స్: టి.ఎస్.రావు, కాస్ట్యూమ్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాణ నిర్వహణ: వినాయకరావు నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X