twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ vs చిరంజీవి.. సంక్రాంతిలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ హిట్లు కొట్టారో తెలుసా..

    |

    సంక్రాంతి ఫెస్టివల్స్ లో ఏ సినిమా అయినా సరే మంచి టాక్ సొంతం చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటాయి. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు అయితే ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. అయితే సంక్రాంతి ఫైట్ లో నందమూరి బాలకృష్ణ అలాగే చిరంజీవి ఇదివరకే 9 సార్లు పోటీపడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి వారు పోటీకి సిద్ధమయ్యారు. ఇక వారి బాక్సాఫీస్ సైట్ లో ఎవరు ఎన్ని సార్లు హిట్లు కొట్టారో తెలుసుకుందాం పదండి..

    మొదట్లో మెగాస్టార్ విజయాలు

    మొదట్లో మెగాస్టార్ విజయాలు

    మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య 1985 సంక్రాంతికి పోటీ మొదలయ్యింది. ఆ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ ఆత్మబలం అనే సినిమా వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో చిరంజీవి సినిమా మాత్రమే సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగ రాముడు అనే సినిమాతో రాగా నందమూరి బాలకృష్ణ భార్గవ రాముడు అనే సినిమాతో వచ్చాడు. ఇందులో కూడా మళ్లీ మెగాస్టార్ చిరంజీవి పై చేయి సాధించారు.

    మంచి దొంగతో మళ్ళీ విజయం

    మంచి దొంగతో మళ్ళీ విజయం

    ఇక 1988లో మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగ అనే సినిమాతో వచ్చాడు. ఇక అప్పుడు బాలకృష్ణ ఇన్స్ పెక్టర్ ప్రతాప్ సినిమా కూడా విడుదలైంది. ఇక ఈ రెండిటిలో మళ్లీ మెగాస్టార్ మంచి దొంగ భారీ విజయాన్ని అందుకుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక 1997లో మెగాస్టార్ హిట్లర్ సినిమాతో బాలకృష్ణ పెద్దన్నయ్య అనే సినిమాతో వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

    బాలయ్య ఇండస్ట్రీ హిట్

    బాలయ్య ఇండస్ట్రీ హిట్

    ఇక మళ్లీ రెండేళ్ళ తర్వాత 1999లో మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోక నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి మాత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక మళ్ళీ ఆ ఏడాది తరువాత 2000వ సంవత్సరంలో బాలకృష్ణ వంశోద్ధారకుడు అనే సినిమాతో వచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసి బిగ్ హిట్ సొంతం చేసుకున్నాడు.

    బాలకృష్ణ వరుస హిట్స్

    బాలకృష్ణ వరుస హిట్స్

    ఇక 2001లో నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఇక అప్పుడే మెగాస్టార్ చిరంజీవి నుంచి భారీ అంచనాలతో మృగరాజు అనే సినిమాతో రాగా అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక 2004లో మరోసారి బాలకృష్ణ లక్ష్మీనరసింహ అనే సినిమాతో సక్సెస్ అందుకోగా మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాతో మరో డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది.

    ఎవరికి ఎన్ని హిట్లు?

    ఎవరికి ఎన్ని హిట్లు?

    మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన అనంతరం 2017లో ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఇక బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా అప్పుడే వచ్చింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

    అంటే ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి ఫెస్టివల్స్ లో తొమ్మిది సార్లు పోటీ పడగా అందులో మెగాస్టార్ చిరంజీవి నాలుగుసార్లు పై చేయి సాధించారు. ఇక రెండుసార్లు సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోగా బాలకృష్ణ మరో మూడు సార్లు మెగాస్టార్ ను డామినేట్ చేసి సక్సెస్ అయ్యాడు.

    10వ సారి సంక్రాంతి ఫైట్

    10వ సారి సంక్రాంతి ఫైట్

    ఇక ఇప్పుడు మళ్ళీ చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలు సంక్రాంతి బరిలో నిలచాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. మరి 10వ సారి పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

    English summary
    Nandamuri balakrishna and megastar chiranjeevi movies sankranthi box office fight results..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X