బాలయ్య లైనప్ మాములుగా లేదు.. నాలుగేళ్ళకు సరిపడా కథలు రెడీ!

నందమూరి బాలకృష్ణ ఒక సినిమాను స్టార్ట్ చేశారు అంటే జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేయాలని చూస్తారు. దర్శకుడు కరెక్ట్ స్క్రిప్ట్ ప్లానింగ్ చేసుకోవాలే గాని సమయాన్ని లెక్క చేయకుండా పని చేస్తుంటారు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే బాలయ్య తన స్పీడ్ తో నేటితరం యువ హీరోలకు చాలెంజ్ విసురుతుంటారు. ఇక చాలా కాలం అనంతరం బాలయ్య వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టారు. మరో నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ 106వ సినిమా అఖండ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 107వ సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

Nandamuri balakrishna back to back movies powerful line up

అలాగే పూరి జగన్నాథ్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ముందు ఎవరితో వర్క్ చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కొడుకుతో కూడా బాలకృష్ణ ఇటీవల ఆదిత్య 999 ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన దర్శకత్వంలోనే సినిమా సెట్స్ పైకి వస్తుందని కూడా చెప్పేశారు. దీంతో అభిమానుల్లో మోక్షజ్ఞ ఎంట్రీపై ఒక్కసారిగా అంచనాల డోస్ పెరిగిపోయాయి. మరి ఈ లైనప్ తో బాలకృష్ణ తన మార్కెట్ ను ఏ స్థాయికి పెంచుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X