twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శాసించే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. ఇంకా ఆ కసి తీరలేదు.. బాలకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్

    |

    ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు ధన్యమైన జన్మనిచ్చి... మీ అందరి గుండెల్లో ఆయన ఆ మహానుభావుడి సరూపాన్ని కల్పించిన.. విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏమిటో చూపించిన మహానుభావుడు, నా గురువు, నా తండ్రి, కారణజన్ముడు ఎన్టీఆర్‌కు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. నటనతో అందర్నీ మెప్పించిన అలాంటి వ్యక్తి ఎక్కడా లేరు అని ఏ నటుడైనా ఒప్పుకోవాల్సిందే అని పద్యాలు పాడుతూ.. నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

     ఈ రోజు నుంచే సంక్రాంతి మొదలు

    ఈ రోజు నుంచే సంక్రాంతి మొదలు

    ఒంగోలుకు వచ్చిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులకు న్యూఇయర్ విషెస్. ముందుగా తెలియజేసేందంటే.. ఈ రోజు నుంచే సంక్రాంతి పండుగ మొదలైంది. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన అందరికి హృదయపూర్వక కళాభివందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యుడైన దర్శకులు. ఒంగోలు వాసులు బీ గోపాల్ గారికి ధన్యవాదాలు. బీ గోపాల్ నా జీవితంలో, సినిమా పరిశ్రమలో శాశ్వతంగా, మరిచిపోలేనటువంటి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్‌పెక్టర్, నరసింహరెడ్డి, సమరసింహారెడ్డి, సీమసింహం లాంటి విజయాలు ఇచ్చిన వ్యక్తి బీ గోపాల్ అని బాలయ్య ప్రశంసలు కురిపించారు.

     వేదికపై పెద్దరికం ఉండే వ్యక్తి ఆయనే..

    వేదికపై పెద్దరికం ఉండే వ్యక్తి ఆయనే..


    వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎవరిని ఆహ్వానించాలనే విషయం చర్చకు వచ్చినప్పుడు.. ఈ వేదికను శాసించే వ్యక్తి ఎవరు లేరు. ఈ వేదికను ఎక్కే వ్యక్తి ఎవడు లేడు. ఈ వేదికను పెద్దరికంతో అలరించే ఆ అర్హత ఉన్న వ్యక్తి కేవలం బీ గోపాల్ మాత్రమే. అందుకే గోపాల్ గారినే పిలిచాం అని బాలయ్య అన్నారు. గత జన్మలో చేసిన మంచి పనులకు ఈ జీవితంలో ఒకరిని సంపాదించుకొవచ్చు అంటారు. కానీ నేను కోట్లాది మందిని సంపాదించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. వారితో నా జన్మజన్మల బంధం, డబ్బుతో కొనలేనిది అభిమానం అని బాలయ్య అన్నారు.

    నా దర్శకుడు ఒంగోలు గిత్త

    నా దర్శకుడు ఒంగోలు గిత్త


    వీరసింహారెడ్డి చిత్రానికి దర్శకుడు ఒంగోలు వాసి మలినేని గోపిచంద్. ఆయన నా అభిమాని. నా సినిమాలు చూడటానికి ఎన్నో దెబ్బలు తిన్నారు. అలాంటి వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన ఒంగోలు గిత్త లాంటి వాడు.నా తదుపరి సినిమాకు కూడా ఒంగోలు వాసి అనిల్ రావిపూడి దర్శకత్వ వహిస్తున్నారు. నేను రాయలసీమకే పరిమితం అవతానని అనుకొంటారు. కానీ నేను తెలంగాణ, ఆంధ్రాలో కూడా బొబ్బిలిసింహాన్ని. రోషానికి ప్రతీకనై ఉన్నానని చెప్పే రెడ్డిని, నాయుడిని నేనే అని బాలయ్య అన్నాడు.

    అన్ని కులాలను ఆదరించే బాలకృష్ణను

    అన్ని కులాలను ఆదరించే బాలకృష్ణను


    అభిమానుల అపూర్వమైన అభిమానికి మంచి హృదయాన్ని పరిచే వ్యక్తిని. అన్ని కులాలను ఆదరించే బాలకృష్ణను. ఎన్నో సినిమాలు చేశాను. కానీ కసి తీరలేదు. బాలకృష్ణ అంటే ఇంకా దగ్గరగా చూడాలనే కోరికకు ఆహా ఓటీటీ ద్వారా అన్‌స్టాపబుల్ కార్యక్రమం ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మమొగుడు అయి కూర్చున్నది. ఏదైనా అంకితభావంతో చేస్తే సాధించలేనిది ఏదీ లేదని మా నాన్న గారి నుంచి నేర్చుకొన్నాను అని బాలయ్య తెలిపారు.

     మైత్రీ మూవీ మేకర్స్ గురించి

    మైత్రీ మూవీ మేకర్స్ గురించి


    నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి వీరసింహారెడ్డిని అద్బుతంగా తెరకెక్కించారు. వాళ్లకు మంచి టీమ్ ఉంది. అన్ని విభాగాలు బాగా సమన్వయం చేశారు. ఈ సినిమా ఒక విస్పోటనం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ సినిమా తప్పకుండా బాగా ఆడుతుందని నా ప్రగాఢ విశ్వాసం అని బాలకృష్ణ చెప్పారు.

    English summary
    Much Expected Veera Simha Reddy movie's pre release event is happend at Ongole town. Nandamuri Balakrishna power speech here..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X