For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda నుంచి అదిరిపోయే ప్రకటన: ‘అడిగా అడిగా’ అంటోన్న నందమూరి బాలకృష్ణ

  |

  ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. తన వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్‌ను కూడా అందుకోలేకపోయిన ఈ సీనియర్ హీరో.. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ, ఇవన్నీ ఆయనతో పాటు ఫ్యాన్స్‌కు కూడా నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారాయన. ఇందుకోసం గతంలో తనకు రెండు విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జోడీ కట్టారు.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే 'సింహా', 'లెజెండ్' భారీ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇంత భారీ విజయాల తర్వాత బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన చేస్తున్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ భాగం మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవాలో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తున్నారు.

  Nandamuri Balakrishnas Akhanda Movie First Song on September 18th

  నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ పలు టీజర్లు విడుదల అయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా టైటిల్ రోర్ వీడియోకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ వీడియో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.

  Maestro Full Movie: నితిన్‌కు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్

  'అఖండ' మూవీలోని ఫస్ట్ సాంగ్ గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫలానా రోజు ఇది విడుదల అవుతుంది అంటూ ప్రచారాలు జరిగాయి. కానీ, దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ డేట్‌ను ప్రకటించారు. 'అఖండ' మూవీలో నుంచి 'అడిగా అడిగా' అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెప్టెంబర్ 18న సాయంత్రం 5:33 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు, ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి బాలకృష్ణ ఉన్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

  సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని దసరాకు విడుదల చేస్తారన్న టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. This Film First Song Release on September 18th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X