Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ టాపిక్: ఎన్టీఆర్‌తో మళ్లీ ప్లాన్ చేసిన కల్యాణ్ రామ్.. ఎంత మంచి వ్యూహం రూపొందించావయ్యా.!
నందమూరి కల్యాణ్ రామ్.. హరికృష్ణ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న హీరో. నిర్మాతగా.. హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ స్టార్ హీరో.. కొన్నేళ్ల నుంచి ప్రయోగాత్మక చిత్రాలను చేస్తున్నాడు. పరాజయాల నుంచి నేర్చుకున్న పాటలతో కెరీర్‌ను సక్రమంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా అతడు తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ అదిరిపోయే వ్యూహాన్ని రచించాడట. ఇంతకీ ఏంటా వ్యూహం.? వివరాల్లోకి వెళితే...

అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు
కెరీర్ ఆరంభంలో ‘అతనొక్కడే' అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు కల్యాణ్ రామ్. ఆ తర్వాత అతడు చేసిన చాలా సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం అనిల్ రావిపూడితో కలిసి చేసిన ‘పటాస్'తో బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే మంచి చిత్రాలను అందిస్తున్నాడు.

మంచితనంతో బరిలో దిగుతున్నాడు
కల్యాణ్ రామ్ - ‘శతమానం భవతి' ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా'. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కథానాయిక. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ మూవీ వస్తోంది.

ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్
ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే, ట్రెండింగ్‌లోనూ ఇవి టాప్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఎన్టీఆర్ వచ్చినా తృప్తి లేకుండా చేశారు
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే, ఈ వేడుకకు వచ్చిన నందమూరి ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల కల్యాణ్ రామ్ మాట్లాడలేకపోయాడు. అదే సమయంలో తారక్ కూడా ఎంతో సమయం మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. దీంతో ఎన్టీఆర్ వచ్చినా చిత్ర యూనిట్‌కు సంతృప్తికరంగా అనిపించలేదు.

ఎన్టీఆర్‌తో మళ్లీ ప్లాన్ చేసిన కల్యాణ్ రామ్
సినిమాకు ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో కల్యాణ్ రామ్ అదిరిపోయే ప్లాన్ వేశాడని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా గురించి తారక్‌తో ఓ వీడియోను చేయించబోతున్నారట. తెలుగు ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలుపడంతో పాటు తన అన్న సినిమాను చూడాలని అందులో ఎన్టీఆర్ చెప్పబోతున్నాడని అంటున్నారు.

ఆ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ కామెంట్
ఇక, రెండు రోజుల క్రితం విడుదలైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ‘అల.. వైకుంఠపురములో' సినిమాను ఉద్దేశించిన తారక్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. హీరో, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ సహా యూనిట్ అందరిపై అతడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో చేసిన పోస్టులకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.