Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Amigos Teaser: సర్‌ప్రైజ్ చేసిన కల్యాణ్ రామ్.. అదిరిపోయిన అమిగోస్ టీజర్
నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణమైన కథలతో మూవీలు చేస్తోన్న అతడు.. పెద్దగా విజయాలను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సోషియో ఫాంటసీ జోనర్‌లో టైం ట్రావెల్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. తద్వారా అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?
'బింబిసార' సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే నందమూరి కల్యాణ్ రామ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు రాజేంద్ర రెడ్డి అనే దర్శకుడితో 'అమిగోస్' అనే మరో ప్రయోగాత్మక సినిమాను చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే అనౌన్స్ చేసేసింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న 'అమిగోస్' మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో అతడి మూడు పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూడు రోల్స్‌లో కల్యాణ్ రామ్ వైవిధ్యాన్ని చూపించాడు. ఇక, ఈ టీజర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మొత్తంగా ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీంతో దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. అదే సమయంలో ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది.
బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న 'అమిగోస్' మూవీలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా అషికా రంగనాథ్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.