ఛాలెంజింగ్ రోల్ కోసం సిద్దమైన నాని.. ఆ బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఎలా ఉంటుందో?
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానులు అతని నుంచి ఎక్కువగా కోరుకునేది కామెడీ. అయితే మరీ రొటీన్ గా కామెడీ సినిమాలు చేయకుండా నాని మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది. ఇక టక్ జగదీష్ సినిమాను దాదాపు పూర్తి చేసిన నాని ఆ వెంటనే మరో ఛాలెంజింగ్ రోల్ స్పీడ్ పెంచేందుకు సిద్ధమయ్యాడు.
నాని కెరీర్ లో ఇప్పటివరకు కెరీర్ మరో స్థాయికి వెళ్లే బిగ్ బడ్జెట్ సినిమా చేయలేదు. ఇక శ్యామ్ సింగరాయ్ మాత్రం కెరీర్ కు మంచి యూ టర్న్ ఇచ్చే సినిమా అవుతుందని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ట్యాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఆ సినిమా పిరియాడిక్ డ్రామాలో తెరకెక్కనుందట. బడ్జెట్ కూడా నాని మార్కెట్ కు మించి ఉంటుందని సమాచారం.

అయితే ఇదివరకు ఈ ప్రాజెక్టును సీతారా ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ విషయంలో కాస్త తడబడడంతో కొత్త నిర్మాతలు ట్రాక్ లోకి వచ్చారు. అందుకు సంబంధించిన రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపించే నాని ఇటీవల వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేశాడట. సినిమాతోనే ఎలాగైనా నాని తన మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని అనుకుంటున్నాడు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











