twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ ఘరానా మొగుడు వచ్చేశాడు.. చూసే అదృష్టం లేదు.. సైరా విషయమై నాని ఆవేదన

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' అక్టోబర్ 2వ తేదీన భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. గాంధీ జయంతి రోజున థియేటర్లన్నీ మెగా జోష్‌లో కళకళలాడాయి. మొదటి రోజే ఈ సినిమాకు హిట్ టాక్ రావడం సినీ లోకాన్నే సంబరాల్లో ముంచెత్తింది. తాజాగా ఇదే విషయమై నాచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు. వివరాల్లోకి పోతే..

    సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ

    సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ

    'సైరా నరసింహా రెడ్డి' పై సినీ ప్రముఖులంతా అభినందనల వెల్లువ కురిపించారు. సురేందర్ రెడ్డి టేకింగ్, అబ్బురపరిచే విజువల్స్, చిరంజీవి అసాధారణ ప్రతిభను పెద్ద ఎత్తున కొనియాడారు. సైరాలో రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు ఉన్నాయంటూ ట్వీట్స్ చేశారు. దీంతో సైరాడే సంబరాలు మిన్నంటాయి.

    సంబరాలు చూసి తెగ ఫీలైపోయిన నాని

    సంబరాలు చూసి తెగ ఫీలైపోయిన నాని

    మెగా అభిమానుల సంబరాలు, సైరా నరసింహా రెడ్డి సెన్సేషన్ చూసి తెగ ఫీల్ అయ్యాడు నాచురల్ స్టార్ నాని. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ఇంతకీ నాని ఫీల్ కావడానికి కారణమేంటో తెలుసా? ఆయన సైరా సినిమాను చూడలేక పోవడమే. ఇదే విషయాన్ని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు నాని.

    బాక్సాఫీస్ ఘరానా మొగుడు అంటూ

    బాక్సాఫీస్ ఘరానా మొగుడు అంటూ

    ''ప్రస్తుతం నేను సౌత్ కొరియా దేశంలో ఉన్నాను. ఇక్కడ సైరా సినిమా చూసే అవకాశం లేదు. కానీ టాక్ వినిపించింది. ఇండియాలో బాక్సాఫీస్ ఘరానా మొగుడు తిరిగి వచ్చాడని తెలిసింది. సైరా చూడాలని ఆతృతగా ఉంది. ఇక్కడి నుంచే చిరంజీవి గారికి బిగ్ హగ్'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు నాని. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

    కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర

    రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కింది. 1920 నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పౌరుషాన్ని ప్రేక్షకుల ముందుంచారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. దీంతో ''ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు జీవం పోశారు చిరంజీవి. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చారు'' అని రాజమౌళి కూడా కితాబిచ్చారు.

    Recommended Video

    Chiranjeevi Explained How Amitabh Bachchan Exempted Syeraa Offer
    సైరా నరసింహా రెడ్డి మూవీ

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. Now Nani commented Sye Raa Narasimhaa Reddy and chiranjeevi. He says..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X