Don't Miss!
- News
బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Nani 29 Dasara: ఊహించని గెటప్‌తో భయపెట్టిన నాని.. బద్దల్ బాసింగాలైతై అంటూ ఊరమాస్‌గా!
బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించి.. ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఆ తర్వాత హీరోగా మారాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అతడు.. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. ఇలా హిట్లు మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీగా పెరుగుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో నాని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు.
జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్
ఆ మధ్య కాలంలో వరుస విజయాలతో సత్తా చాటిన నేచురల్ స్టార్ నాని.. 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు చిత్రాలను లైన్‌లో పెట్టడం.. వాటికి సంబంధించిన షూటింగ్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేయడం చేస్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'టక్ జగదీష్' మూవీని పూర్తి చేసుకున్న అతడు.. ఇటీవలే దాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి కూడా గుమ్మడికాయ కొట్టేశాడు. ఇక, ప్రస్తుతం నాని చేతిలో 'అంటే.. సుందరానికీ' అనే సినిమా మాత్రమే ఉంది.

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రాల తర్వాత నేచురల్ స్టార్ నాని చేయబోయే సినిమా గురించి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాని తదుపరి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడని చాలా రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే తన 29వ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించబోతున్నట్లు నాని ట్వీట్ చేశాడు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేస్తున్నట్లు కూడా అందులో వెల్లడించాడు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Most Eligible Bachelor Twitter Review: మూవీకి ఊహించని టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఆ పొరపాటు లేకుంటే!
తాజాగా నేచురల్ స్టార్ నాని తన 29వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశాడు. ఈ సినిమాకు 'దసరా' అనే టైటిల్‌ను పెట్టారు. పూర్తి స్థాయి విభిన్నమైన నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కథతో తెరకెక్కబోతుంది. ఈ మేరకు Siren Of Dasara పేరిట ఓ మోషన్ వీడియోను సైతం విడుదల చేశాడు. ఇందులో విజువల్స్ ప్రేక్షకులను కట్టి పడేసేలా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా చివర్లో 'ఈ దసరా నిరుళ్లెక్కుండదీ.. బాంచత్ జెమ్మి వెట్టి జెప్తున్నా.. బద్దల్ బాసింగాలైతై.. ఎట్లైతే గట్లే సూస్‌కుందాం' అంటూ తెలంగాణ యాసలో నాని చెప్పే డైలాగ్ గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది.
ఇక, బ్యాగ్రౌండ్‌లో నాని గుబురు గెడ్డంతో ఊరమాస్ లుక్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయబోతున్నాడు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.