నాని ప్యారడైజ్ విలన్ గా లెజెండరీ యాక్టర్.. మంచు లక్ష్మీ లీక్
నేచురల్ స్టార్ నాని చివరిగా హిట్ 3 చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక నెక్ట్స్ నాని నుంచి రాబోతున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ప్యారడైజ్. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే దసరా చిత్రం వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పైగా నాని కెరీర్ లో మొదటి 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మరోసారి వీరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో ప్యారడైజ్ చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకున్నాయి.
ప్యారడైజ్ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో రూపొందిస్తుండం విశేషం. డ్రాగన్ మూవీ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. నాని జడల్ అనే మాస్, రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. దసరా, హిట్ 3 కంటే మరింత వైల్డ్ గా దర్శనమివ్వబోతున్నారని ఇప్పటికే మేకర్స్ అంచనాలు పెంచేశారు. రూ.120 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ చిత్రంలో విలన్ గా కిల్ సినిమా ఫేమ్ బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ విలన్ గా నటిస్తున్నారని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా తాజాగా నటి, హీరోయిన్, ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి నాని ప్యారడైజ్ చిత్రం గురించి అదిరిపోయే లీక్ ఇచ్చింది. ప్యారడైజ్ చిత్రంలో కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నటిస్తున్నట్టు చెప్పింది. తాజాగా తన రాబోయే చిత్రం దక్ష మూవీ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని బయటికి చెప్పేసింది. మోహన్ బాబు ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారని చెప్పింది.
కాగా, సెకండ్ ఇన్నింగ్స్ లో మోహన్ బాబు విలన్ పాత్రల్లోనే బాగా ఆకట్టుకున్నారు. దీంతో ప్యారడైజ్ చిత్రంలోనూ ఆయన విలన్ గానే అలరించబోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్యారడైజ్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది 2026 మార్చి 26న పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా రానున్నాయి.
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం విశేషం. సినిమా ఫస్ట్ కాపీ కూడా రాకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. నెట్ ఫ్లిక్స్ ప్యారడైజ్ చిత్రం డిజిటల్ రైట్స్ ను రూ.65 కోట్లకు, సారెగమ ఆడియో రైట్స్ ను రూ.18 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. దీంతోనే సినిమా బడ్జెట్ లో 70 శాతం రికవరీ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రానికి ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











