For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెరపై ‘టక్ జగదీష్’కు ఊహించని రేటింగ్: అమెజాన్‌లో అలా.. టీవీలో వచ్చినప్పుడు ఇలా

  |

  స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో నాని. నేచురల్ స్టార్ అన్న బిరుదుకు సార్థకం చేస్తూ తన ప్రతి సినిమానూ సహజ సిద్ధమైన నటనతో వన్ మ్యాన్ షోగా మార్చుతున్నాడు. అందుకే అతడి మూవీలు హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఈ టాలెంటెడ్ హీరో.. సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం నాని 'టక్ జగదీష్' అనే మూవీ చేశాడు.

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  'నిన్న కోరి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాని.. శివ నిర్వాణ కాంబోలో వచ్చిన చిత్రమే 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ఏది వచ్చినా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. దీంతో ఇది థియేటర్లలో సత్తా చాటడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వెండితెరపై విడుదల చేయలేదు. అయితే, ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే నేరుగా స్ట్రీమింగ్ చేశారు.

  Nanis Tuck Jagadish Movie gets 10.90 TRP in 1st Time Telecast

  ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టక్ జగదీష్' మూవీకి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. ఇది చూసిన వాళ్లలో కొంత మంది బాగుందని.. కొందరు యావరేజ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఇది మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. కానీ, అమెజాన్‌లో మాత్రం భారీ స్థాయిలోనే క్లిక్కులను రాబట్టింది. ఫలితంగా ఆ సంస్థ లెక్కల ప్రకారం హిట్‌గా నిలిచింది. అంతేకాదు, అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టినట్లు సదరు సంస్థ ప్రకటించింది. దీంతో నాని ఖాతాలో ఓ హిట్ వచ్చి చేరినట్లు అయింది. దీనిపై అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  నేచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' మూవీని ఇటీవలే స్టార్ మా చానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేశారు. అయితే, అక్కడ దీనికి ఊహించని విధంగా రేటింగ్ వచ్చింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 10.90 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది మంచి రేటింగే అయినా నాని రేంజ్‌కు మాత్రం చాలా తక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం బుల్లితెరపై మాత్రం నిరాశనే మిగిల్చినట్లైంది.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'టక్ జగదీష్' మూవీలో నాని ఎమ్మార్వో పాత్రను పోషించాడు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లు. థమన్, గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మించారు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

  English summary
  Natural Star Nani, Ritu Varma and Aishwarya Rajesh Did Tuck Jagadish Movie Under Shiva Nirvana Direction. This Movie gets 10.90 TRP in 1st Time Telecast.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X