Don't Miss!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- News
నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Tuck Jagadish నుంచి బిగ్ సర్‌ప్రైజ్: ఆ లింక్‌పై క్లిక్ చేస్తే నానిని నేరుగా కలవొచ్చట
బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎంట్రీ ఇచ్చి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో నాని. నేచురల్ స్టార్ అన్న బిరుదుకు సార్థకం చేస్తూ తన ప్రతి సినిమానూ సహజ సిద్ధమైన నటనతో వన్ మ్యాన్ షోగా మార్చేస్తుంటాడు. అందుకే అతడి మూవీలు హిట్లు ఫ్లానులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రేక్షకారణను అందుకుంటూ ఉంటాయి.
అయితే, ఈ మధ్య కాలంలో ఈ టాలెంటెడ్ హీరో.. సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల అతడు 'టక్ జగదీష్' అనే మూవీ చేశాడు. ఇది రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సంగతులు మీకోసం!

‘టక్' వేసుకుని రెడీ అయిన నాని
'నిన్న కోరి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాని.. శివ నిర్వాణ కాంబోలో వస్తున్న చిత్రమే 'టక్ జగదీష్'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లు. థమన్, గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మించారు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

తొలిసారి అలా.. అంచనాలు భారీగా
సుదీర్ఘమైన ప్రయాణంలో నాని ఎన్నో తరహా పాత్రల్లో నటించాడు. అయితే, అభిమానులకు మాత్రం అతడిని మాస్ హీరోగా చూడాలన్న కోరిక చాలా కాలంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య అలాంటి చిత్రాలనూ ట్రై చేశాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'టక్ జగదీష్' మూవీలో టక్ వేసుకునే కత్తి పట్టుకుని కనిపించాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఎప్పుడో అయినా,.. బ్రేక్‌లు తప్పలే
కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'టక్ జగదీష్' షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. కానీ, అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీన్ని గత సమ్మర్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో ఇది పలుమార్లు వాయిదా పడింది. ఇక, సెకెండ్ వేవ్ తర్వాత కూడా టికెట్ రేట్లు, కర్ఫ్యూ వంటి కారణాలతో ఇది ప్రేక్షకుల ముందుకు రాలేదు.
Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

నాని సినిమాతో టాలీవుడ్‌లో గొడవ
నేచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్' మూవీని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేస్తున్నారు. ఈ విషయం కొద్ది రోజుల క్రితం 'లవ్ స్టోరీ' నిర్మాతల ప్రెస్‌మీట్‌తో ఇది కాస్తా బయటకు వచ్చింది. అదే సమయంలో పెద్ద రచ్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' నిర్మాతలు తమ సినిమా ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ లేఖను కూడా విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది.

స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ చేసేశారుగా
చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న విధంగానే.. 'టక్ జగదీష్' చిత్రాన్ని సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే వెల్లడించింది. అంతేకాదు, ఆ తర్వాత సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌ను కూడా చూపించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.
Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

టక్ జగదీష్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్
నేచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన 'టక్ జగదీష్' మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే టెక్నాలజీని వాడుకుంటూ అదిరిపోయేలా 'టక్ జగదీష్ వర్చువల్ ఫ్యామిలీ మీట్' ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.
Recommended Video

నానిని కలవాలంటే క్లిక్ చేయండి
ఆన్‌లైన్ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు 'టక్ జగదీష్' టీమ్ సెప్టెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు 'టక్ జగదీష్ వర్చువల్ ఫ్యామిలీ మీట్' ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనాలనుకునే వాళ్లు tuckjagadishfilm.comపై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.